Apple Bonus: యాపిల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం బోనస్​గా రూ.76 వేలు!

Apple Bonus: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఉద్యోగులను ఆఫీస్​ నుంచి పని చేయించుకోవాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలే ఇందుకు కారణంగా తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 03:07 PM IST
  • యాపిల్ ఉద్యోగులకు మరికొంత కాలం వర్క్ ఫ్రం హోం
  • ఉద్యోగులను ఆఫీస్​కు రప్పించాలన్న నిర్ణయం ఉపసంహరణ
  • ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయాలే కారణం
Apple Bonus: యాపిల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం బోనస్​గా రూ.76 వేలు!

Apple Bonus: టెక్​ దిగ్గజం, ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తమ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోంను మరికొంత కాలం కొనసాగించాలని (Apple on Work form Home) నిర్ణయించింది. అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్​ (ఒమిక్రాన్) భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

యాపిల్ ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వచ్చే ఏడాది  ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు తిరిగి రావాల్సి ఉంది. అయితే కరోనా భయాలు మళ్లీ పెరుగుతున్న (Corona Omicron variant) నేపథ్యంలో ఈ నిర్ణయంపై కంపెనీ వెనక్కి తగ్గింది.

అయితే తప్పనిసరి పనుల ఉద్యోగులకు మాత్రం ఆఫీసుకు రావాల్సి ఉంటుందని పేర్కొంది. వర్క్​ ఫ్రం హోం ఎప్పటి వరకు కొనసాగుతుంది? అనే విషయంపై ఇంకా స్పష్టతనివ్వలేదు.

ఆ ఉద్యోగులకు 1000 డాలర్లు బోనస్​..

వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు 1000 డాలర్ల చొప్పున (దాదాపు రూ.76 వేలు) బోనస్​గా (Apple Bonus) ప్రకటించింది యాపిల్. ఉద్యోగులు వర్క్ ఫ్రం కోసం సరైన ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ బోనస్​ ఇస్తున్నట్లు తెలిపింది.

రెండేళ్లుగా కొవిడ్ ఆంక్షల నడుమే...

దాదాపు రెండేళ్లుగా కొవిడ్ ఆంక్షల నడుమే చాలా సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అమెరికాలో కూడా దిగ్గజ కంపెనీలైన గూగుల్​, ఫేస్​బుక్​ వంటి సంస్థలు కూడా వర్క్ ఫ్రం హోం పద్ధతిలోనే ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి.

ఒమిక్రాన్​ వేరియంట్ బయటపడక ముందు వరకు.. ఈ టెక్ దిగ్గజాలన్ని వచ్చే ఏడాది నుంచి ఉద్యోగులను చాలా వరకు ఆఫీస్​ నుంచి పని చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఇందుకోసం ఉద్యోగులకు వ్యాక్సినేషన్​ తప్పనిసరి చేశాయి కూడా. రెండు డోసుల వ్యాక్సిన్​ వేసుకోని వారికి వేతనాల చెల్లింపు నిలిపివేత వంటి నిర్ణయాలకు సిద్ధమయ్యాయి. కానీ ఒమిక్రాన్​ వేరియంట్​ రాకతో ఆ ప్రణాళికలన్నింటిని వాయిదా వేసుకున్నాయి.

Also read: Jio Rs 1 Plan: అతి చౌకైన ప్లాన్ ప్రవేశపెట్టిన జియో.. Rs.1 తో రీచార్జ్.. ఇందులో ఏం ఉండనున్నాయంటే..?

Also read: Todays Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News