APPLE iPhone 13 Bumper Discount: ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టముండదండి..అందరికీ ఐఫోన్ అంటే చాలా ఇష్టం. కానీ దాని ధరలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది మంచి సమయమని చెప్పొచ్చు. దసరా సందర్భంగా అన్ని ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. అయితే ఈ సంవత్సరం ఈ సేల్ ఇదే నెలలో 23 నుంచి ప్రారభం కానుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా పలు కంపెనీల ఫోన్లపై ఇప్పటికే ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.. ముఖ్యంగా ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇది ఐఫోన్ కొనాలనుకునేవారికి మంచి ఆవకాశంగా చెప్పొచ్చు. అయితే ఈ ఐఫోన్ 13పై ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి ఆఫర్లను ప్రకటించిందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
ఈ ఫోన్‌పై డిస్కౌంట్ ఎంత..?:
ఐఫోన్ 13 128 GB మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 69900కి విక్రయిస్తోంది. అయితే దీని అసలు ధర వచ్చేసి 70,000 కాగా ఇతర ఆఫర్ల కారణంగా ఆ రేటుకు లభిస్తోంది. 128 GB రూ. 69900కి లభించడం ఇదే మొదటి సారిగా చెప్పొచ్చు. అయితే ఐఫోన్ అంటే ఇష్టం ఉన్నవారు దీనిని ఈ రేటు కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభించడం విశేషం.. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చి..కొంత డబ్బులు చెల్లించి ఈ మొబైల్ కొనుగోలు చేయోచ్చు. ఇలాంటి అద్భుత అవకాశం ఇవ్వడం ఇదే మొదటి సారి..అయితే ఈ డీల్ వల్ల ఐఫోన్ కొనాలనుకున్నవారి ఫ్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు. అంతేకాకుండా HDFC క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2000దాకా క్యాష్ బ్యాక్ లభించనుంది.
ఏమిటి దీని ప్రత్యేకత:
ఐఫోన్ 13 6.10-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వినియోగదారులకు పరిచయం చేశారు. దీని రిజల్యూషన్ 1170x2532 పిక్సెల్‌లు వస్తోంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. Apple A15 బయోనిక్ ప్రాసెసర్‌తో వినియోగదారులకు అందుబాటులో ఉంది. iOS 15పై పని చేస్తుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్‌లో లభిస్తోంది. ముఖ్యంగా 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఎక్కువగా విక్రయిస్తోంది. అంతేకాకుండా అత్యధునిక సాంకేతితో 23W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందుబాటులోకి తీసువచ్చారు.
స్పెషల్ ఫీచర్లు:
>>174 గ్రా (6.14 oz)బరువు
>>5.78 x 2.81 x 0.30 అంగుళాలు
>>గ్లాస్ ఫ్రంట్ (గొరిల్లా గ్లాస్), గ్లాస్ బ్యాక్ (గొరిల్లా గ్లాస్), అల్యూమినియం ఫ్రేమ్
>>6.1(90.2 సెం.మీ 2)అంగుళాలు పరిమాణం
>>రక్షణగా స్క్రాచ్-రెసిస్టెంట్ సిరామిక్ గ్లాస్, ఒలియోఫోబిక్ పూత
>>iOS 15, iOS 16కి అప్‌గ్రేడబుల్ OSతో నడుస్తుంది
>>Apple A15 బయోనిక్ చిప్‌సెట్, CPU హెక్సా-కోర్
>>4-కోర్ గ్రాఫిక్స్ Apple GPU
>>128GB 4GB ర్యామ్, 256GB 4GB ర్యామ్, 512GB 4GB ర్యామ్
>>డ్యూయల్-LED, డ్యూయల్-టోన్ ఫ్లాష్, HDR (ఫోటో/పనోరమా)
>>Li-Ion 3240 mAh, నాన్-రిమూవబుల్ బ్యాటరీ
>>23W ఫాస్ట్ ఛార్జింగ్
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok