ATM Card Benefits: ఏటీఎం కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్, కార్డుతో పాటు 5 లక్షల ప్రయోజనముందని తెలుసా

ATM Card Benefits: బ్యాంకులకు సంబంధించి, కలిగే ప్రయాజనాల గురించి చాలా మంది ఖాతాదారులకు తెలియని అంశాలుంటాయి. బ్యాంకుల ద్వారా కలిగే కొన్ని రకాల ప్రయోజనాల గురించి అవగాహన ఉండదు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2023, 04:36 PM IST
ATM Card Benefits: ఏటీఎం కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్, కార్డుతో పాటు 5 లక్షల ప్రయోజనముందని తెలుసా

ATM Card Benefits: మీ దగ్గరుండే బ్యాంకు ఏటీఎం కార్డుతో..మీకు 5 లక్షల రూపాయల ప్రయోజనం కలగనుంది. వాస్తవానికి ఇది ఎప్పట్నించో అమల్లో ఉన్నా చాలామందికి తెలియదు. ఏటీఎం కార్డు వినియోగించేవారికి 5 లక్షల వరకూ ప్రయోజనం కల్పిస్తోంది బ్యాంకు. ఈ 5 లక్షల ప్రయోజనం ఎలా కలగనుందో తెలుసుకుందాం..

దేశంలోని అన్ని బ్యాంకులు కస్టమర్లకు ఏటీఎం కార్డు జారీ చేస్తుంటాయి. ఏటీఎం కార్జుతో పాటు 5 లక్షల రూపాయల ప్రయోజనం కలగనుంది. ప్రతి బ్యాంకు ఏటీఎం వినియోగించే కస్టమర్లకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పిస్తుందని చాలా మందికి తెలియదు. ఇది ఉచితంగా లభించే ఇన్సూరెన్స్. ఏటీఎం కార్డు వాడే కస్టమర్లకు బ్యాంకు తరపున ఉచిత సేవలు లభిస్తాయి. ఇందులో ముఖ్యమైంది ఇన్సూరెన్స్. బ్యాంకు ఎవరైనా కస్టమర్‌కు ఏటీఎం కార్డు జారీ చేస్తూనే..యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రారంభమైపోతుంది. ఈ బీమా గురించి చాలామందికి తెలియదు.

బ్యాంక్, కార్డు హోల్డర్లకు వేర్వేరు కేటగరీల్లో ఇన్సూరెన్స్ అందిస్తోంది. కార్డు కేటగరీ క్లాసిక్, ప్లాటినం, ఆర్డినరీగా ఉంటాయి. సాధారణ మాస్టర్ కార్డుపై 50 వేల రూపాయలు, క్లాసిక్ ఏటీఎం కార్డుపై 1 లక్ష రూపాయలు, వీసా కార్డుపై 1.5 నుంచి 2 లక్షల రూపాయలు, ప్లాటినం కార్డుపై 5 లక్షల రూపాయల బీమా లభిస్తోంది.

బ్యాంకులో దరఖాస్తు ఇవ్వాలి

ఒకవేళ ఏటీఎం కార్డు యూజర్లు ఏదైనా దుర్ఘటనలో మరణిస్తే..1 నుంచి 5 లక్షల రపాయల వరకూ బీమా లభిస్తుంది. ఒకవేళ ఒక కాలు లేదా చేయికి గాయం తగిలితే 50 వేల రూపాయల వరక బీమా ఇన్సూరెన్స్ లభిస్తుంది. దీనికి సంబంధించి బ్యాంకులో దరఖాస్తు ఇవ్వాల్సి వస్తుంది. కార్డు హోల్డర్లు నామినీ పేరు వివరాలు బ్యాంకులో సమర్పించాల్సి వస్తుంది. చాాలామందికి ఈ విషయాలు తెలియవు. బ్యాంకులు కూడా ఈ విషయంలో పెద్దగా అవగాహన కల్పించడం లేదు. 

Also read: Mesh Sankranti 2023: రేపు మేషరాశిలోకి సూర్యుడు... ఈ 5 రాశులకు లాభాలు బోలెడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News