Bajaj Dominar 400 Price: ఈ బజాజ్ బైక్‌పై రూ. 25 వేల భారీ తగ్గింపు.. సూపర్ కదా

Bajaj Dominar 400 Bike Price, Discount : బజాజ్ డామినార్ 400 లాంటి హై సీసీ ఇంజన్ బైక్ పై రూ. 25 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వడం అంటే నిజంగా ఇది టెంప్టింగ్‌గానే ఉందంటున్నారు ఈ తరహా బైక్స్ అంటే ఇష్టపడేవారు. అంతేకాదు.. హై సీసీ బైక్స్ కొనుగోలు చేయాలనే కోరిక ఉండి అంత పెద్ద మొత్తంలో అధిక ధర వెచ్చించలేక ఆగిపోయిన వారికి కూడా ఇది రైట్ ఆఫర్ అంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 06:47 PM IST
Bajaj Dominar 400 Price: ఈ బజాజ్ బైక్‌పై రూ. 25 వేల భారీ తగ్గింపు.. సూపర్ కదా

Bajaj Dominar 400 Bike Price Discount: బైక్ కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. అందులోనూ మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలి అనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్ అవుతుంది. బజాజ్ కంపెనీ లాంచ్ చేసిన బజాజ్ డామినార్ 400 బైక్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఎంత భారీ డిస్కౌంట్ అంటే.. ఏకంగా రూ. 25 వేల డిస్కౌంట్‌తో ఈ బైక్ లభించనుంది. బైక్స్‌పై ఇంత భారీ డిస్కౌంట్ ఎప్పుడూ చూసి ఉండరు కదా. ఇంతకీ ఇది నిజమేనా కాదా అని నమ్మలేకపోతున్నారా ? అవును.. నిజమే. నమ్మితీరాల్సిందే.

BS-6 బైక్స్ స్టాక్ క్లీయరెన్స్ కోసం బజాజ్ సెలెక్ట్ డీలర్స్ ఈ ఆఫర్ అందిస్తున్నారు. బిఎస్ 6 స్టేజ్ 2 నిబంధనలతో మార్కెట్లోకి వస్తున్న వాహనాలకు స్పేస్ రెడీ చేయడం కోసం సెలెక్ట్ బజాజ్ డీలర్స్ ఈ ఆఫర్ ప్రకటించారు. ఇదివరకు రూ. 2,24,991 గా ఉన్న బజాజ్ డామినార్ 400 బైక్‌ ధర.. తాజాగా రూ. 25 వేల భారీ తగ్గింపు అనంతరం రూ. 1,99,991 కి దిగి వచ్చింది. దీంతో బజాజ్ డామినార్ 400 బైక్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం కానుంది. 

373 CC సింగిల్ సిలిండర్ ఇంజన్, లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీతో రూపొందిన బజాజ్ డామినార్ 400 బైక్‌ 8,800 rpm తో 29.4 kW (40 bhp) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్  ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ ఈ బైక్ సొంతం. లాంగ్ రైడ్ ఇష్టపడే వారికి, బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ బజాజ్ డామినార్ 400 బైక్‌ ని తయారుచేసినట్టు బజాజ్ కంపెనీ ప్రకటించింది. 

మరీ ముఖ్యంగా లాంగ్ రైడ్స్‌కి వెళ్లే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా టాల్ వైజర్, హ్యాండ్ గార్డ్, ఇంజన్ బ్యాష్ ప్లేట్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, క్యారియర్, బ్యాక్ స్టాపర్, నావిగేషన్ స్టే, శాడిల్ స్టే వంటి యాసెసరీస్ అదనంగా అందిస్తున్నారు. ఈ ఆఫర్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మీకు దగ్గర్లోని బజాజ్ డీలర్స్‌ని సంప్రదిస్తే సరిపోతుంది. ఏదేమైనా బజాజ్ డామినార్ 400 లాంటి హై సీసీ ఇంజన్ బైక్‌పై రూ. 25 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వడం అంటే నిజంగా ఇది టెంప్టింగ్‌గానే ఉందంటున్నారు ఈ తరహా బైక్స్ అంటే ఇష్టపడేవారు. అంతేకాదు.. హై సీసీ బైక్స్ కొనుగోలు చేయాలనే కోరిక ఉండి అంత పెద్ద మొత్తంలో అధిక ధర వెచ్చించలేక ఆగిపోయిన వారికి కూడా ఇది రైట్ ఆఫర్ అంటున్నారు.

ఇది కూడా చదవండి : Car Mileage Tips: ఈ సింపుల్ టిప్స్‌తో కారు మైలేజ్ పెంచుకోండి

ఇది కూడా చదవండి : SUV Electric Scooter: ఎలక్ట్రిక్ ఎస్‌యూవి స్కూటర్.. ఫీచర్స్ కూడా అదే రేంజులో

ఇది కూడా చదవండి : Tata Tiago Car: జనం కళ్లు మూసుకుని కొంటున్న చీప్ అండ్ బెస్ట్ టాటా కారు ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News