River Indie Electric Scooter: ఎస్‌యూవి అనే సెగ్మెంట్ ఇప్పటివరకు కేవలం ఫోర్ వీలర్స్‌కి చెందిన విషయం మాత్రమే అని అనుకుంటున్నాం కదా.. కానీ టూ వీలర్స్‌లోనూ ఎస్‌యూవి తరహా వాహనాన్ని డిజైన్ చేశామని చెబుతోంది బెంగళూరుకు చెందిన రివర్ అనే స్టార్టప్ సంస్థ. ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీలో సృజనాత్మకతను జోడించేందుకు ప్రయత్నిస్తున్న రివర్.. తాజాగా రివర్ ఇండీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో దీనిని ఒక ఎస్‌యూవిగా పరిచయం చేసింది.
ఎస్‌యూవి కార్ల తరహాలోనే ఎలాంటి దారుల్లోనైనా స్మూత్‌గా వెళ్లగలిగేలా 14 అంగుళాల అలాయ్ వీల్స్ అమర్చారు. చాలా శాతం టూ వీలర్స్ కంటే భిన్నంగా రెండు పెద్ద పెద్ద హెడ్ ల్యాంప్స్ అమర్చడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి కొత్త లుక్ తీసుకొచ్చారు. సీటు కింది భాగంలో 43 లీటర్ల కెపాసిటీతో స్టోరేజీ సౌకర్యం అందుబాటులో ఉంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన గ్లోవ్ బాక్సు 12 లీటర్ల స్టోరేజీ కెపాసిటీ కలదు. ఈ వాహనానికి రెండు వైపులా లాక్ చేసుకునే సౌకర్యంతో రెండు పానియర్ బాక్సులు ఉన్నాయి. ఈ రెండు క్యారియర్ బాక్సులు కూడా కస్టమైజ్డ్ బాక్సులే. అవసరం లేనప్పుడు తొలగించే విధంగా ఏర్పాటు చేశారు.
6.7KW (8.9bhp), 26Nm టార్క్ ఉత్పత్తి చేసేలా ఎలక్ట్రిక్ మోటార్‌ని అమర్చారు. 3.9 సెకన్లలోనే గంటకు జీరో నుంచి 40 కిమీ వేగం వెళ్లేంత సామర్థ్యం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం. గంటకు 90 కిమీ గరిష్ట వేగంతో వెళ్లగలదు అని రివర్ ప్రకటించింది.
18 డిగ్రీల గ్రేడ్ ఎబిలిటీతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్ సౌలభ్యం కోసం ఈకో, రైడ్, రష్ అంటూ మూడు మోడ్స్‌లో డిజైన్ చేశారు. ఓపెన్ ఏరియాలోనూ విజిబిలిటీ స్పష్టంగా కనిపించేలా హైకాంట్రాస్ట్ డిస్‌ప్లే, రెండు యూఎస్‌బి చార్జింగ్ పోర్ట్స్‌తో పాటు రివర్స్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. 4kwh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అమర్చారు. 5 గంటల్లో 80 శాతం చార్జింగ్ పూర్తయ్యే ఈ వాహనం సింగిల్ చార్జింగ్ తో 120 కిమీ రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదు రూ. 1.25 లక్షలుగా నిర్ణయించినట్టు రివర్ ప్రకటించింది. ఇప్పటికే ఈ వాహనం కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రీబుకింగ్ ప్రారంభించిన రివర్ కంపెనీ.. ఆగస్టు నుంచి వాహనాలను డెలివరి చేయనున్నట్టు స్పష్టంచేసింది.
ఇది కూడా చదవండి : Tata Tiago Car: జనం కళ్లు మూసుకుని కొంటున్న చీప్ అండ్ బెస్ట్ టాటా కారు ఇదే
ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు
ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks Cars: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook