Best Electric Bikes: రూ.999కే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోండి.. రూ.100కే 400 కిలోమీటర్లు ప్రయాణం చేయండి!

Top Electric Bike in India, Hop Oxo X Electric Bike gives 400KM. హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్‌తో మీరు రూ.100కే 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ బైక్‌ను బుక్ చేసుకోవడానికి కేవలం రూ.999 చెల్లించాలి.  

Written by - P Sampath Kumar | Last Updated : Dec 15, 2022, 12:12 PM IST
  • రూ.100కే 400 కిలోమీటర్ల ప్రయాణం
  • రూ.999కే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోండి
  • ఇప్పటికే 10,000 బుకింగ్‌లు అయ్యాయి
Best Electric Bikes: రూ.999కే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోండి.. రూ.100కే 400 కిలోమీటర్లు ప్రయాణం చేయండి!

Here is best Electric Bikes in India 2022: పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశాన్ని అంటుండడంతో భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లో వదిలాయి. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌లో తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సిద్ధం అయ్యాయి. 

ఎలక్ట్రిక్ టూ-వెహికల్ స్టార్టప్ హాప్‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility).. ఎలక్ట్రిక్ బైక్ 'హాప్ ఆక్సో'ను సెప్టెంబర్ నెలలో విడుదల చేసింది. కంపెనీ ఈ బైక్‌ను ఆక్సో మరియు ఆక్సో ఎక్స్ అనే రెండు వేరియంట్లలో రిలీజ్ చేసింది. విశేషమేమిటంటే.. ఈ ఎలక్ట్రిక్ బైక్‌తో మీరు రూ.100కే 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ బైక్‌ను బుక్ చేసుకోవడానికి కేవలం రూ.999 చెల్లించాలి. ఈ బైక్ డెలివరీ ఇప్పటికే ప్రారంభమైంది. జైపూర్‌లో 2500 బైక్‌లు డెలివరీ అయ్యాయి. ఇప్పటికే 10,000 బుకింగ్‌లు అయ్యాయి. హాప్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వీటిని కొనవచ్చు.

జైపూర్‌తో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్‌లలో కూడా ఎలక్ట్రిక్ బైక్ 'హాప్' డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. హాప్ ఆక్సో రూ.1.25 లక్షల ధరతో లాంచ్ కాగా.. హాప్ ఆక్సో ఎక్స్ రూ.1.40 లక్షల ధరతో విడుదల అయ్యింది. హాప్ ఆక్సో, హాప్ ఆక్సో ఎక్స్ బైక్‌ల లుక్ అచ్చం పెట్రోల్ బైక్స్‌ లాగానే ఉంది. అందుకే ఈ బైక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ బైక్.. సిటీ రోడ్లపై బాగా పనికొస్తుందని హాప్ కంపెనీ చెబుతోంది. 

ఎలక్ట్రిక్ బైక్ 'హాప్'లో 3.75 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఇవ్వబడింది. ఆక్సో ఎక్స్ వేరియంట్‌లో పూర్తి ఛార్జ్‌తో 150 కిమీ ప్రయాణం చేయొచ్చు. 95 కిమీ టాప్ స్పీడ్ మరియు 200Nm టార్క్ అందుబాటులో ఉన్నాయి. ఆక్సో ఎక్స్ వేరియంట్‌పై 1కిమీ దూరం ప్రయాణించేందుకు కేవలం 25 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇలా చూసుకుంటే.. రూ. 100లో ఏకంగా  400 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. పెట్రోల్‌తో చూసుంటే.. ఇది చాలాచాలా బెటర్. 

అదే సమయంలో ఆక్సో వేరియంట్‌లో పూర్తి ఛార్జ్‌లో 135 కిమీ ప్రయాణించొచ్చు. 90 కిమీ టాప్ స్పీడ్ మరియు 185Nm టార్క్ ఇది అందిస్తుంది. టర్బో మోడ్‌లో ఆక్సో ఎక్స్ 4 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకోగలదు. బైక్‌ను 16 amp పవర్ సాకెట్‌లో దాని స్వంత పోర్టబుల్ స్మార్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. దీన్ని 0-80% వరకు ఛార్జ్ చేయడానికి 4 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది. ఈ బైక్‌లు ఫీచర్ల పరంగా కూడా అధునాతనమైనవి. మొత్తం 5 కలర్ ఆప్షన్లలో ఈ బైక్స్ వస్తున్నాయి.

Also Read: Saturn Transit 2023: కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి రాజయోగం.. 2025 వరకు రెండు చేతులా డబ్బు సంపాదిస్తారు!

Also Read: Home Vastu Plants: తులసి, మనీ ప్లాంట్‌లను ఇంట్లో ఈ దిక్కున పెడితే అష్టదరిద్రం.. లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్లిపోతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News