Best Investment Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు 4.5 లక్షల వడ్డీ మీ సొంతం

Best Investment Scheme: వృద్ధాప్యంలో ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పోస్టాఫీసుల్లో చాలా పథకాలున్నాయి. ఈ పధకాల్లో ఇన్వెస్ట్ చేస్తే పెద్దమొత్తంలో వడ్డీ రూపంలో నగదుకు గ్యారంటీ ఉంటుంది. అలాంటి పధకమే ఇది. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 11, 2024, 05:42 PM IST
Best Investment Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు 4.5 లక్షల వడ్డీ మీ సొంతం

Best Investment Scheme: పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న చాలా పధకాల్లో వడ్డీ రూపంలో రిటర్న్స్ బాగుంటాయి. ఇందులో కీలకమైంది పోస్టాపీసు టైమ్ డిపాజిట్. ఇందులో ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే కేవలం వడ్డీనే 4.5 లక్షలు చేతికి అందుతుంది. ఆశ్చర్యపోతున్నారా..అదెలాగో చూద్దాం.

ఐదేళ్ల కాల వ్యవధితో పోస్టాఫీసులో చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైన పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పధకంలో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత ఏకంగా 4 లక్షల 50 వేల రూపాయలు వడ్డీ రూపంలో తీసుకోవచ్చు. పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే ఇలాంటి పధకాలు పేద, మధ్య తరగతివారికి ఉద్దేశించి రూపకల్పన చేసినవే. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో మాత్రం ఎవరైనా ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్‌పై వడ్డీ అత్యధికంగా 7.5 శాతం ఉంటుంది. ఇన్‌కంటాక్స్ శాఖ సెక్షన్ 80సి ప్రకారం ఏడాదికి 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు కూడా పొందవచ్చు. ఈ పధకంలో మొత్తం నగదు ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వడ్డీ ఎప్పటికప్పుడు జమ అవుతుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది పోస్టాఫీసు ఎఫ్‌డి లాంటిది. 

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో 1 ఏడాది వరకూ 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. రెండవ ఏడాది 7 శాతం వడ్డీ చెల్లిస్తుంది ప్రభుత్వం. ఇక మూడవ ఏడాది 7.1 శాతం వడ్డీ ఉంటుంది. ఇక మిగిలిన రెండేళ్లు 7.5 శాతం వడ్డీ ఉంటుంది. ఒంటరిగా లేదా ముగ్గురు కలిసి ఈ స్కీమ్ ప్రారంభించవచ్చు. ఈ పధకంలో కనిష్టంగా 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్టంగా ఎంతైనా ఉంటుంది. అయితే స్కీమ్ ప్రారంభించిన ఆరు నెలల వరకూ విత్‌డ్రా చేసేందుకు సాధ్యం కాదు.

ఒకేసారి 10 లక్షలు ఈ పధకంలో ఇన్వెస్ట్ చేయగలిగితే ఐదేళ్లకు వడ్డీ రూపంలో 4 లక్షల 49 వేల 948 రూపాయలు అందుతాయి. అంటే మొత్తం 14 లక్షల 49 వేల 948 రూపాయలు చేతికి అందుతాయి.

Also read: Best 7 Seater Car: కేవలం 6 లక్షలకే బెస్ట్ 7 సీటర్ ఎంపీవీ కారు, ధర, ఫీచర్లు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News