Best MG Cars: ఛీప్‌ రేట్లతో మరో 5 కార్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన Mg Motors.. రేట్లు ఎంతో తెలుసా?

Best MG Cars Under 12 Lakhs: భారత మార్కెట్‌ చాలా రకాల కొత్త కార్లు ప్రతి నెల విడుదలువుతాయి. అయితే ఎంజీ నుంచి కూడా ప్రస్తుతం స్టైల్, స్మార్ట్, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో, సావీ ప్రో అనే ఐదు వేరియంట్లతో కూడిన కార్లు విడుదలయ్యాయి. అయితే ఈ కార్లకు సంబంధించి వివరాలను మనం తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 12:39 PM IST
 Best MG Cars: ఛీప్‌ రేట్లతో మరో 5 కార్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన Mg Motors.. రేట్లు ఎంతో తెలుసా?

Best MG Cars Under 12 Lakhs: భారత మార్కెట్‌లోకి కొత్త కొత్త కంపెనీలకు చెందిన చాలా కార్లు విడుదలవుతున్నాయి. అత్యధునిక ఫీచర్లు కలిగిన చాలా ఇతర దేశాలకు చెందిన కార్లు కంపెనీలు భారత్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ను స్టార్ట్‌ చేశాయి. అయితే చైనాకు చెందిన MG మోటార్స్‌ చెందిన కార్లు వినియోగదారులను ఎలా ఆకర్షించాయో అందరికీ తెలిసిందే.. మొదట ఎంజీ ఒక వేరియంట్‌ను విడుదల చేసి తమదైన స్టైల్‌లో వినియోగదారుల్లో ముద్ర వేసుకుంది. మొదట ఎంజీ హెక్టార్‌ వేరియంట్‌ను మార్కెట్‌లోకి వదిలింది. అయితే ఈ వేరియంట్‌కి విశేష స్పందన రావడమేకాకుండా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హెక్టార్‌కు భిన్నంగా మరి కొన్ని వేరియంట్స్‌తో వినియోగదారుల ముందుకు మరికొన్ని కార్లను తీసుకు వచ్చింది. అయితే వాటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చెద్దాం..

MG మోటార్స్‌ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని స్టైల్, స్మార్ట్, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో, సావీ ప్రో అనే ఐదు వేరియంట్‌లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే ధరల విషయానికొస్తే ఫీచర్లను బట్టి రేట్లను కేటాయించిది కంపెనీ రూ.14.72 లక్షల నుంచి మొదలై రూ.22.42 లక్షల దాకా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో హెక్టర్ వేరియంట్‌లో 5 నుంచి 7 సీట్ల దాకా లభిస్తున్నాయి. ఇక కలర్స్‌ విషయానికొస్తే.. డ్యూయల్ టోన్ ఆర్గైల్ బ్రౌన్, బ్లాక్ ఇంటీరియర్‌తో ప్రస్తుతం అందుబాటలో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఎంజీ కార్లలో అటానమస్ లెవెల్ 2 (ADAS) అప్‌డేట్‌ టెక్నాలజీతో వినియోగదారులకు వినియోగంలోకి వచ్చాయి. ఇందులో ట్రాఫిక్ జామ్ అసిస్ట్ (TJI) సహా మొత్తం 11 ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

నెక్స్ట్-జెన్ హెక్టర్ ముందు భాగంలో ఆర్గైల్ డైమండ్ మెష్ గ్రిల్‌ను అమర్చారు. ఇది 35.56 సెం.మీ (14 అంగుళాల) HD పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీనితో పాటు కంపెనీ తన డిజిటల్ బ్లూటూత్ కీని ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో కీ-షేరింగ్ ఫంక్షన్ కూడా ఉంది. ఈ కార్లలో  మొత్తం 75కి పైగా కనెక్టింగ్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది. పెద్ద పెద్ద కార్లులాగా ఐ-స్మార్ట్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులో స్టీరింగ్‌ను తిప్పిన వెంటనే ఆన్ అయ్యే ఇంటిలిజెంట్ ఆటో టర్న్ ఇండికేటర్లను కంపెనీ అందించింది.

ట్రాఫిక్ జామ్ అసిస్ట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫీచర్‌ వల్ల లాభాలేంటి అని అందరికీ మదిలో ప్రశ్న మెదిలే అవకాశాలున్నాయి. అయితే ట్రాఫిక్ జామ్‌లో కారు లైన్‌ మధ్యలో ఉంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ ఫీచర్‌తో సురక్షితంగా దూర ప్రయాణాలు చేయోచ్చు. అంతేకాకుండా ఈ కారును ట్రాఫిక్‌ జామ్‌లో కూడా సులభంగా నడపగలిగే ఎన్నో రకాల ఫీచర్లు ఇందులో అమర్చారు. ఇవే కాకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ HD కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS)ని కూడా అందుబాటులో ఉంది.

Also read: Supreme Court: ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

Also read: Supreme Court: ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News