VI Recharge Plans: వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ ప్లాన్‌తో 3 నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్..

VI Recharge Plans: ప్రముఖ టెలికాం సంస్థ వీఐ రూ.151కే 3 నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 28, 2022, 02:36 PM IST
  • వొడాఫోన్ ఐడియాలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్
  • రూ.151 ప్లాన్‌తో 3 నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్
  • నెల రోజుల పాటు 8 జీబీ డేటా
VI Recharge Plans: వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ ప్లాన్‌తో 3 నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్..

VI Recharge Plans: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కొద్దిరోజుల క్రితం సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ని లాంచ్ చేసింది. రూ.151తో కూడిన ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు మూడు నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్కిప్షన్ పొందుతారు. అలాగే, నెల రోజుల వాలిడిటీతో 8 జీబీ డేటా పొందుతారు. ఈ ప్లాన్‌లో ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌లకు అవకాశం లేదు. అంటే.. ఇది పూర్తిగా డేటా ప్లాన్. ఇంకా చెప్పాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం వొడాఫోన్ అందిస్తున్న ప్రత్యేక ప్యాక్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రెగ్యులర్‌గా వీక్షించే కస్టమర్లకు ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు.

వొడాఫోన్ ఐడియా రూ.299 ప్లాన్

వొడాఫోన్ ఐడియా అందిస్తున్న మరో రీఛార్జ్ ప్లాన్ రూ.299తో అన్‌లిమిటెడ్  కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్, రోజుకు 1.5 జీబీ డేటా పొందుతారు. దీని వాలిడిటీ 28 రోజులు. అంతేకాదు.. ఈ ప్లాన్‌తో ప్రతీరోజూ రాత్రి 12 గం. నుంచి ఉదయం 6గం. వరకు ఫ్రీ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్‌తో వీకెండ్ రోల్ ఓవర్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అంటే సోమవారం-శుక్రవారం వరకు మీరు ఉపయోగించని డేటా వీకెండ్‌కు ఫార్వార్డ్ అవుతుంది.

వొడాఫోన్ ఐడియా రూ.479, రూ.719తో కూడిన ప్లాన్స్ కూడా అందిస్తోంది. ఈ రెండింటిలోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 1.5 జీబీ డేటా పొందుతారు. రూ.479 ప్లాన్‌కి 56 రోజుల వాలిడిటీ, రూ.719కి 84 రోజుల వాలిడిటీ వర్తిస్తుంది. దాదాపుగా ఇవే బెనిఫిట్స్‌తో రూ.839 ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్యాక్‌లో రోజుకు 2 జీబీ డేటా పొందవచ్చు.వొడాఫోన్ ఐడియాలో 365 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.1799, రూ.2899లకు ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. 

Also Read: TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటినుంచి అంటే..

Also Read: Hyderabad Job Mela : రేపే హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. నిరుద్యోగులు మిస్ చేసుకోకండి.. ఇదే గోల్డెన్ ఛాన్స్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News