ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్ టెల్.. ధరల వివరాలివే!

Airtel Recharge Plans Increase: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. అన్ని ప్లాన్లపై 20-25 శాతం ధరలు పెంచనున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. నవంబరు 26 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 12:49 PM IST
ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్ టెల్.. ధరల వివరాలివే!

Airtel Recharge Plans Increase: ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్ ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్​, అన్​లిమిటెడ్ వాయిస్ ప్యాక్​లు, మొబైల్ డేటా రీఛార్జ్​లపై ఉన్న ధరలపై 20-25 శాతం పెంచినట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్​ ధర 25 శాతం.. అన్​లిమిటెడ్ వాయిస్ బండిల్స్ ధర 20 శాతం పెంచినట్లు పేర్కొంది. కొత్త ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వివరించింది.

కొత్త ధరలు.. దేశంలో 5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయని ఎయిర్​టెల్​ పేర్కొంది. కొత్త రేట్ల ప్రకారం.. వాయిస్ ప్లాన్స్ ధర ఇంతకుముందు రూ.79 కాగా ప్రస్తుతం రూ. 99కు చేరింది. 50 శాతం అధిక టాక్​టైం, 200 జీబీ మొబైల్ డేటా, సెకనుకు 1 పైసా వాయిస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ప్లాన్ గడువు 28 రోజులు ఉంది.

మొబైల్ రీఛార్జ్​ ప్లాన్స్​ ద్వారా.. ఒక్కో యూజర్ నుంచి సరాసరి రెవెన్యూ (ఏఆర్​పీయూ) రూ. 200 నుంచి రూ. 300 వరకు ఎయిర్​టెల్​కు చేరుతున్నట్లు కంపెనీ తెలిపింది. అన్​లిమిటెడ్ వాయిస్ బండిల్స్, డేటా టాప్​అప్స్​పైనా రీఛార్జ్ ధరలు పెరిగినట్లు ఎయిర్​టెల్ పేర్కొంది.  

Also Read: రిలయన్స్ ఇండస్ట్రీస్-సౌదీ ఆరామ్​కో డీల్​కు బ్రేక్​..!

Also Read: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News