Adani about a 70-hour work week: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా ఉద్యోగి వారానికి 70 గంటలు చొప్పున పని చేస్తే అతని భార్య పారిపోతుందంటూ అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంశం గురించి మాట్లాడుతూ గౌతమ్ అదానీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశ చేరాలంటే.. యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. దీనిపై పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఇదే అంశం గురించి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కూడా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. వర్క్ బ్యాలెన్స్ విషయంలో మీరు అనుసరిస్తున్న విధానాలు ఇతరులపై రుద్దకూడదు అన్నారు.
కొందరు 4గంటలు కుటుంబానికి సమయం వెచ్చించి ఆనందాన్ని పొందుతారు. అది వారి బ్యాలెన్స్ కానీ ఇక్కడ ఒక విషయం ఇక్కడ గుర్తించుకోవాలి. కేవలం పనిలోనే నిమగ్నమైపోతే భార్య పారిపోతుంది. వాస్తవానికి మీకు నచ్చిన పనులు చేస్తే మీ జీవితంలో సమతుల్యత ఉంటుంది.
Also Read: Gold Rate Today: కొత్త సంవత్సరం వేళ..తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందో తెలిస్తే కొనేస్తారు
కుటుంబం, ఉద్యోగం ఇవే మనకు ప్రపంచం. కానీ పిల్లలు కూడా మనం నుంచి ఇవే విషయాలు గమనించి ఆచరిస్తుంటారు. ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. మన జీవితం మరింత సరళంగా మారుతుంది అని గౌతమ అదానీ అన్నారు.
గతంలో ఓ పాడ్ కాస్ట్ లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఉత్పాదకత తక్కువగా ఉందన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారతదేశంలోని యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఆయన సూచించారు.
నారాయణమూర్తి వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా..మరికొందరు బాస్ లు నారాయణమూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.
Also Read: EPFO: పెన్షన్ దారులకు గుడ్‌న్యూస్..ఇక నుంచి దేశంలో ఎక్కడైనా, ఏ బ్యాంకు నుంచైనా పింఛన్ తీసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.