BSNL Prepaid Plans: ప్రముఖ ప్రైవేట్ టెలికం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ ప్లాన్ పెంచినప్పటి నుంచి చాలామంది బీఎస్ఎన్ఎల్ వైపుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా బెస్ట్ ప్లాన్స్ లాంచ్ చేసింది. ఇందులో కొత్తగా 160 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రవేశపెట్టింది.
బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన 160 రోజుల ప్లాన్ చాలామందిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే్ ఇందులో 320 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. అంతేకాకుండా 160 రోజుల ప్రీ పెయిడ్ ప్లాన్ ధర కేవలం 997 రూపాయలు మాత్రమే. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉండనే ఉంటాయి. ఇతర కంపెనీ ప్లాన్స్‌తో పోలిస్తే ఇది బెస్ట్ ప్లాన్. ఒకసారి రీఛార్జ్ చేస్తే దాదాపు 6 నెలలు వస్తుంది. దేశవ్యాప్తంగా ఫ్రీ రోమింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది.
రోజుకు 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇతర కంపెనీల్లో 84 రోజుల వ్యాలిడిటీకే 8 వందల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ క్రమంలో 997 రూపాయలకు 160 రోజుల వ్యాలిడిటీ అంటే మంచి ఆఫర్.
అంతేకాకుండా వార్షిక ప్లాన్ కూడా బీఎస్ఎన్ఎల్ ఇతర కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువకు అందిస్తుంది. 1999 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో 600 జీబీ డేటా ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఎలాగూ ఉంటాయి. ఇదే ఇతర కంపెనీ ప్లాన్స్‌లో అయితే ఏడాది ప్లాన్స్ రోజుకు 1.5 జీబీ డేటాతో 3500 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇక కొత్తగా మరో ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటాయి. ఈ ప్లాన్ ధర 2399 రూపాయలు. ఓవరాల్‌గా చూసుకుంటే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాతో పోలిస్తే 60 శాతం వరకూ డబ్బులు ఆదా అవుతాయి.
ఇక బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు మరో గుడ్‌న్యూస్. త్వరలో 5జి సేవలు ప్రారంభించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇటీవలే బీఎస్ఎన్ఎల్ 4జి సేవల్లోకి మారింది. 4 జీ టవర్స్ అన్నింట్లో 5జి నెట్‌వర్క్ టెస్టింగ్ జరుగుతోంది. త్వరలో 5జీ లాంచ్ చేయవచ్చు.
Also read: Post Office Superhit Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌తో నెలకు 20,500 రూపాయలు గ్యారంటీ ఆదాయం, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook