Home loan: కొత్త ఇల్లు కొంటున్నారా..అయితే హోంలోన్ తీసుకునే వారికి ఈ బ్యాంకుల్లో బంపర్ ఆఫర్

Home loan: కొత్త ఇల్లు కొనుగోలు చేస్తున్నారా. అయితే హోంలోన్ తీసుకునేవారికి బెస్ట్ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. పరిమిత కాల వ్యవధికి అతి తక్కువ వడ్డీ తీసుకునే బ్యాంకులు ఏవో ఇప్పుడు చూద్దాం.   

Written by - Bhoomi | Last Updated : Nov 1, 2024, 01:10 PM IST
Home loan: కొత్త ఇల్లు కొంటున్నారా..అయితే హోంలోన్ తీసుకునే వారికి ఈ బ్యాంకుల్లో  బంపర్ ఆఫర్

Home loan: సొంత ఇల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. ఈ విషయంలో అందరికీ ఎదురయ్యే ఇబ్బంది ఆర్థిక సమస్య. దీపావళి సందర్బంగా ఇలాంటి వారి కోసం బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లను ముందుకు తీసుకువచ్చాయి. అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ రేటుకే హోంలోన్ అందిస్తున్నాయి. పరిమిత కాలవ్యవధి 20ఏళ్లకు సుమారు రూ. 75 లక్షల రుణాన్ని ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. మరి హోం లోన్ ఇస్తున్న  బ్యాంకులు ఏవి. ఎంత మొత్తం వడ్డీ వసూలు చేస్తున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

20ఏళ్ల కాల వ్యవధికి తక్కువ వడ్డీ రేటుతో రూ. 7లక్షల అందిస్తున్న టాప్ బ్యాంకులు ఇవే. 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆప్ మహారాష్ట్ర  8.35 వడ్డీ రేటు అందిస్తున్నాయి. నెలకు రూ. 64,376 చెల్లించాల్సి ఉంటుంది.  బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్  8.4 వడ్డీ చెల్లిస్తుండగా..నెలకు రూ. 64, 613 చెల్లించాలి. యూసీఓ బ్యాంక్ , పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, 8.45 నెలకు 64,850 ఈఎంఐ చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ఎస్ బీసీ బ్యాంక్, కర్నాటక బ్యాంక్ 8.5 ఈఎంఐ 65,087 చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read: Rahu Mahadasha: రాహు మహాదశ ఈ రాశికి 18 ఏళ్లు రాజభోగాలు.. లక్షాధికారి అయ్యే బంపర్‌ ఛాన్స్‌!  

అయితే దీపావళి సందర్బంగా అందిస్తున్న ఈ లోన్ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాధారణ బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి వయసు, ఆదాయం ఆధారంగా ఈఎంఐ కాల వ్యవధిని నిర్ణయిస్తుంటాయి. కానీ పండగ సందర్భంగా పరిమిత కాలవ్యవధికే లోన్స్ అందిస్తున్నాయి. అందుకే రుణం తీసుకునేటప్పుడు బ్యాంకు పాలసీలను , లోన్ రూల్స్  గురించి పూర్తి తెలుసుకోవాలి. 

Also Read: LPG Gas Cylinder: సామాన్యులకు పండుగ పూట బిగ్‌షాక్.. ఏకంగా రూ.2,028 చేరిన గ్యాస్‌ సిలిండర్‌..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News