Cars With Highest Boot Space: కేవలం రూ. 10 లక్షలలోపే ఎక్కువ బూట్ స్పేస్‌తో వచ్చే కార్లు

Cars With Highest Boot Space: వీకెండ్ ట్రిప్స్, ఫ్యామిలీతో పిక్నిక్స్, విహార యాత్రలు, క్యాంపింగ్స్ ఇలాంటి అవసరాలన్నింటికి ఎక్కువ డిక్కీ స్పేస్ ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీ చిన్నదయినా, పెద్దదయినా.. ఫ్యామిలీ సైజ్‌తో సంబంధం లేకుండా ఎక్కువ లగేజీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే రూ. 10 లక్షలలోపే ఎక్కువ డిక్కీ స్పేస్‌తో వచ్చే కారు కోసం చూస్తున్న వారి కోసమే ఈ డీటేల్స్.

Written by - Pavan | Last Updated : Sep 30, 2023, 07:47 PM IST
Cars With Highest Boot Space: కేవలం రూ. 10 లక్షలలోపే ఎక్కువ బూట్ స్పేస్‌తో వచ్చే కార్లు

Cars With Highest Boot Space: ఎవరైనా కొత్త కారు కొనేటప్పుడు ఆ కారు ఇంజన్ కెపాసిటీ, మైలేజ్, మోడర్న్ ఫీచర్స్, ఇంటీరియర్స్, సీటింగ్ కెపాసిటీ తరువాత మళ్లీ అంతగా చెక్ చేసే అంశం ఏదైనా ఉందా అంటే అది కారు బూట్ స్పేస్. దీనినే చాలా మంది సింపుల్‌గా కారు డిక్కీ స్పేస్ అని కూడా పిలుస్తుంటారు. కారు సీటింగ్ కెపాసిటీ పెరిగిన సందర్భాల్లో బూట్ స్పేస్ పెరగాల్సిన అవసరం కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ట్రావెల్ చేస్తే.. అంత ఎక్కువ మందికి సంబంధించిన లగేజ్ క్యారీ చేయాల్సి ఉంటుంది కనుక. 

అంతేకాకుండా, కారు సీటింగ్ కెపాసిటీతో సంబంధం లేకుండా అది చిన్న కారు అయినా లేదా పెద్ద కారు అయినా కుటుంబం పెద్దదయినప్పుడు కూడా ఎక్కువ డిక్కీ స్పేస్ అవసరం ఉంటుంది. వీకెండ్ ట్రిప్స్, ఫ్యామిలీతో పిక్నిక్స్, విహార యాత్రలు, క్యాంపింగ్స్ ఇలాంటి అవసరాలన్నింటికి ఎక్కువ డిక్కీ స్పేస్ ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీ చిన్నదయినా, పెద్దదయినా.. ఫ్యామిలీ సైజ్‌తో సంబంధం లేకుండా ఎక్కువ లగేజీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే రూ. 10 లక్షలలోపే ఎక్కువ డిక్కీ స్పేస్‌తో వచ్చే కారు కోసం చూస్తున్న వారి కోసమే ఈ డీటేల్స్. 

సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ : 
సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ SUV కారులో 511 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. 1.2 టర్బో పెట్రోల్ ఇంజన్‌తో రూపొందిన ఈ కారు ఎక్స్-షోరూం ధర 9.99 లక్షలుగా ఉంది.

మారుతి సుజుకి సియాజ్ కారు :
రూ. 10 లక్షల లోపు వచ్చే కారులో మారుతి సుజుకి సియాజ్ ఒకటి. మారుతి సుజుకి బ్రాండ్ నుండి వచ్చిన ఈ బిగ్ సైజ్ సెడాన్ కారులో 502 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన మారుతి సుజుకి సియాజ్ కారు రూ. 9.30 లక్షలలోపే లభిస్తుంది. 

హోండా అమేజ్ కారు :
1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన హోండా అమేజ్ కారులో 420 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. హోండా అమేజ్ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ. 7.05 లక్షల నుండి రూ. 9.66 లక్షల వరకు ఉంటుంది.

టాటా టిగోర్ కారు :
ఇండియాలో అత్యంత సరసమైన ధరలకే లభించే సెడాన్ కార్లలో టాటా టిగోర్ కారు ఒకటి. టాటా టిగోర్ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ.6.30 లక్షలు కాగా హైఎండ్ వేరియంట్ కారు ధర రూ. 8.95 లక్షలుగా ఉంటుంది. ఇందులో 419 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

హ్యాందాయ్ ఆరా కారు :
టాటా టిగోర్ కారు తరహాలోనే తక్కువ ధరలో లభించే హ్యాందాయ్ ఆరా కారులో 402 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఈ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ. 6.33 లక్షలు కాగా టాప్ ఎండ్ కారు ఎక్స్-షోరూం ధర రూ 8.90 లక్షలుగా ఉంది. 

కియా సోనేట్ కారు :
కియా సోనేట్ కారులో 392 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ. 7.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Trending News