Cheapest Recharge Plan: డెడ్‌ ఛీప్‌గా మంత్లీ రిచార్జ్‌ ఫ్లాన్‌ ఇదే.. రూ. 100 కంటే తక్కువ ధరలోనే ఫ్లాన్‌ ..

Cheapest Recharge Plan: మంత్లీ రిచార్జ్‌ ఫ్లాన్‌ల రేట్లు విచ్చల విడిగా పెరిగిపోయాయి. అయితే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని BSNL తక్కువ ధరలోనే ఓ ఫ్లాన్‌ వినియోగదారులకు పరిచయం చేసింది. అయితే ఈ ఫ్లాన్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2023, 12:21 PM IST
Cheapest Recharge Plan: డెడ్‌ ఛీప్‌గా మంత్లీ రిచార్జ్‌ ఫ్లాన్‌ ఇదే.. రూ. 100 కంటే తక్కువ ధరలోనే ఫ్లాన్‌ ..

Cheapest BSNL Recharge Plan: ప్రస్తుతం అన్ని కంపెనీల రీఛార్జ్ ప్లాన్‌ల రేట్లు విచ్చల విడిగా పెరిగిపోయాయి. అయితే కొన్ని కంపెనీలే  కస్టమర్ల బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని రీఛార్జ్ ప్లాన్‌లపై ఆఫర్లు అందిస్తోంది. కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని రీఛార్జ్ ప్లాన్‌ల ధరల తగ్గించడానికి  Jio ముందుంటుంది. అయితే ప్రస్తుతం అన్ని వస్తువుల రేట్లు విచ్చలవిడిగా పెరగడం వల్ల లాంగ్ వాలిడిటీ ప్లాన్‌ల ధర కొన్నిసార్లు పెరుగుతున్నాయి. అయితే ఇలా పెంచేవాటిలో Jio, Vi , Airtel కంపెనీలే ముందున్నాయి. కాబట్టి తక్కువ ధరలో మీరు కూడా రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకోవాలంటే తప్పకుండా మీరు  BSNL కొత్త ఫ్లాన్‌ చేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఫ్లాన్‌ ఎంటో ఈ ఫ్లాన్‌కు సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రీఛార్జ్ ప్లాన్ వివరాలు ఇవే:
మీరు ఈ రోజూ తెలుసుకోబోయే రీఛార్జ్‌ ఫ్లాన్‌లో చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి.     అన్ని ఫ్లాన్స్‌ల్లా కాకుండా కేవలం మీరు రూ. 107తో రిచార్జ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్లాన్‌కు సంబంధించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫ్లాన్‌తో మీరు రూ. 107 రిచార్జ్‌ చేస్తే.. ప్రతి రోజూ 1GB డేటా పొందుతారు. ప్రస్తుతం BSNLలో పలు రకాల మార్పులు జరిగినందును ఇంటర్నేట్‌ స్పీడ్‌ తీరు కూడా చాలా వరకు పెరిగింది. అయితే ఈ ఫ్లాన్‌తో రిచార్జ్‌ చేస్తే 24 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.చ అయితే చాలా చౌకగా బడ్జెట్‌లో మీరు రిచార్జ్‌  ఫ్లాన్స్‌ కోసం చూస్తే ఇది తప్పకుండా మీకు నచ్చుతుంది. అంతేకాకుండా ఈ ఆఫర్‌ కాకుండా చాలా రకాల ఫీచర్లతో 60 రోజులతో కూడిన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన అన్ని వివరాలు అధికారిక వెబ్‌సైట్స్‌లో ఉన్నాయి.

ఈ ప్లాన్ లభించే అతి పెద్ద ఫీచర్‌ మిటంటే ఇందులో లభించే దీర్ఘ కాల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ వాలిడిటీ మొత్తం 84 రోజులు అంటే దాదాపు 3 నెలల వరకు ఉంటుంది. ఈ వ్యాలిడిటీని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు రీఛార్జ్ చేయకుండానే మీ ఫోన్‌ని 3 నెలల పాటు సులభంగా యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. కాబట్టి బడ్జెట్‌లో రిచార్జ్‌ చేసుకోవాలనుకునే వారు ఈ రీఛార్జ్ ఫ్లాన్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఇదే ఆఫర్‌ ఫ్లాన్‌ Jio, Vi, Airtel వంటి కంపెనీలు కూడా అందిస్తున్నాయి. కానీ రూ. 107 కంటే ఎక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే  BSNL ఈ ఫ్లాన్‌ తీసుకురావడానికి ప్రధాన కారణాలు సాధారణ వినియోగదారుల కోసమేనని పేర్కొంది.

Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ

Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News