Cheapest Diesel Cars: సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్ల కంటే బెటర్ ఆప్షన్ .. 8 లక్షల కంటే తక్కువ ధరలో 3 డీజిల్ కార్లు!

Tata Altroz, Hyundai i20 and Honda Amaze are Cheapest diesel cars in India. సీఎన్‌జీ నింపడానికి పొడవైన క్యూలలో నిలబడాలి.. ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేయడానికి చాలా గంటలు పడుతుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు మరొక ఎంపిక డీజిల్ కారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 6, 2023, 02:59 PM IST
  • సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్ల కంటే బెటర్ ఆప్షన్
  • 8 లక్షల కంటే తక్కువ ధరలో 3 డీజిల్ కార్లు
  • ఛార్జ్ చేయడానికి గంటలు
Cheapest Diesel Cars: సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్ల కంటే బెటర్ ఆప్షన్ .. 8 లక్షల కంటే తక్కువ ధరలో 3 డీజిల్ కార్లు!

Cheapest Diesel Cars in India: పెట్రోల్‌ ధరలు దేశంలో ఆకాశాన్ని అంటిన విషయం తెలిసిందే. దేశంలోని పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 నుంచి 110 వరకు ఉంది. దాంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్రోల్‌కు బదులుగా కొందరు వినియోగదారులు సీఎన్‌జీ (CNG Engine) మరియు ఎలక్ట్రిక్ కార్లను (Electric Cars) కొనుగోలు చేస్తున్నారు. అయితే సీఎన్‌జీ నింపడానికి పొడవైన క్యూలలో నిలబడాలి.. ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేయడానికి చాలా గంటలు పడుతుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు మరొక ఎంపిక మిగిలి ఉంది. అదే డీజిల్ కారు ఎంపిక. 

హ్యుందాయ్ కంపెనీ వార్షిక లెక్కల ప్రకారం.. హ్యుందాయ్ డీజిల్ ఇంజన్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్ల కంటే.. డీజిల్ కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయట. డీజిల్ కార్లకు సీఎన్‌జీ మాదిరిగా పొడవైన క్యూ సమస్య అస్సలు ఉండదు. అందుకే డీజిల్ కార్ల అమ్మకాలు పెరిగాయట. చౌకైన డీజిల్ కార్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.

Tata Altroz:
టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.90 లక్షలు. ఆల్ట్రోజ్ పెట్రోల్‌తో పాటు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ డీజిల్ ఇంజన్ 90hp పవర్ మరియు 200Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికను మాత్రమే పొందుతుంది. దీని మైలేజ్ 25 కిలోమీటర్లు.

Hyundai i20:
హ్యుందాయ్ ఐ20 డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 8.43 లక్షలు. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 100PS శక్తిని మరియు 240Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ కారు మైలేజ్ 25 కిలోమీటర్లు. 

Honda Amaze:
హోండా కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారు హోండా అమేజ్. దీని డీజిల్ వేరియంట్ ధర రూ. 9.02 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 100PS పవర్ మరియు 200Nm వరకు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మైలేజ్ 24.7 కిలోమీటర్లు.

Also Read: Jupiter Rise 2023: 2023లో బృహస్పతి ఉదయం.. ఈ 4 రాశుల వారికి పండగేపండగ! డబ్బు వర్షం పక్కా

Also Read: Car Astrology: కారులో ఈ వస్తువులు అస్సలు పెట్టవద్దు.. ఉంటే జీవితాంతం పశ్చాత్తాపడాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News