Air Taxi in India: ఇక ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడు ఏ నగరంలోనంటే

Air Taxi in India: ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో ఆకాశంలో ఎగిరే ట్యాక్సీలు ఇక ఇండియాలో కన్పించనున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా గాలిలో ఎగురుతూ గమ్యస్థానాలు చేరుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా. కానీ నిజమే. ఎప్పుడు ఎక్కడ అనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 9, 2024, 03:51 PM IST
Air Taxi in India: ఇక ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడు ఏ నగరంలోనంటే

Air Taxi in India: ఎయిర్ పోర్ట్స్ కాదు..వెర్టిపోర్ట్స్ అందుబాటులో రానున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెర్టిపోర్ట్స్ నిబంధనలు రూపొందించింది. ఇండిగో కొత్తగా ఎయిర్ ట్యాక్సీలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 200 మిడ్‌నైట్ ఎయిర్ ట్యాక్సీలు సమకూర్చుకునేందుకు ఆర్చర్ ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 

హాలీవుడ్ సినిమాల్లో గాలిలో ట్యాక్సీలు ఎగురుతూ కన్పిస్తుంటాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు మనకు కూడా అలా ఉండాలని అన్పిస్తుంటుంది. ఇదేమీ అసాధ్యం కాదు. ఇండియాలో ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. మరో రెండేళ్లలో అంటే 2026లో ఎయిర్ ట్యాక్సీలు దేశంలో ఎగురనున్నాయి. ఇందులో భాగంగా డీజీసీఏ వెర్టిపోర్ట్ నిబంధనలు రూపొందించింది. ఈ నగరాల్లో మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ సేవలు అందనున్నాయి. ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు గాలిలో ఎగిరెళ్లి గమ్యస్థానాలకు చేరుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వస్తుంది చాలామందికి. ఇప్పుడా ఆలోచనకు రెక్కలు వస్తున్నాయి. త్వరలోనే ఇండియాలో ఎయిర్ ట్యాక్సీ సేవలు అందుబాటులో రానున్నాయి. తొలిసారిగా ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ సేవలు ప్రవేశపెట్టనున్నారు. డీజీసీఏ ఇందుకు సంబంధించి వెర్టిపోర్ట్ నిబంధనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026 నుంచి ఈ సేవలు ప్రారంభం కావచ్చని అంచనా.

ఈ ఎయిర్ ట్యాక్సీల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెర్టిపోర్ట్స్ సిద్ధం చేస్తోంది. ఎయిర్ ట్యాక్సీలు వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ చేసేందుకు వీలుగా ఈ వెర్టిపోర్ట్స్ సిద్ధమౌతాయి. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజస్ మొదటిసారిగా ఎయిర్ ట్యాక్సీ ప్రయత్నం చేసింది. కాలిఫోర్నియా ఆధారిత ఆర్చర్ ఏవియేషన్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దాదాపు 200 మిడ్‌నైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ సమకూర్చుకునేందుకు ఇండిగో 1 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది.

డీజీసీఏ ప్రకారం వెర్టిపోర్ట్ ఏర్పాటుకు వివిధ భాగస్వామ్యాలతో నిబందనలపై చర్చలు సాగాయి. ఈ నిబంధనల ప్రకారం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ ఛార్జింగ్, పార్కింగ్, ల్యాండింగ్, ఎమర్జెన్సీ పరిస్థితులపై కార్యాచరణ రూపొందింది. మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీని ముంబై, ఢిల్లీలో ప్రారంభించనున్నారు. తరువాత బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు విస్తరించనున్నారు. 

Also read: 8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News