PPF Account: మార్చి 31 లోగా ఈ చిన్నపని పూర్తిచేయండి.. లేదంటే మీ ssy, ppf ఖాతాలు క్లోజ్..

PPF-SSY Account Update: మీ పీఎఫ్, సుఖన్య సమృద్ధి యోజన ఖాతాలు యాక్టివ్‌గా ఉండాలంటే ఈ చిన్న పనిచేయండి. అది కూడా మార్చి 31లోగా పూర్తి చేయండి. లేదంటే వారి ఖాతాలు ఇనాక్టివ్ అయిపోతాయి.

Written by - Renuka Godugu | Last Updated : Feb 7, 2024, 03:17 PM IST
PPF Account: మార్చి 31 లోగా ఈ చిన్నపని పూర్తిచేయండి.. లేదంటే మీ ssy, ppf ఖాతాలు క్లోజ్..

PPF-SSY Account Update: మీ పీఎఫ్, సుఖన్య సమృద్ధి యోజన ఖాతాలు యాక్టివ్‌గా ఉండాలంటే ఈ చిన్న పనిచేయండి. అది కూడా మార్చి 31లోగా పూర్తి చేయండి. లేదంటే వారి ఖాతాలు ఇనాక్టివ్ అయిపోతాయి.

పీఎఫ్, ఎస్ఎస్‌వై ఖాతాదారులు ఈ గడువులోగా మినిమం బ్యాలన్స్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ 2024 మార్చి 31 వరకు ఖాతాల్లో కనీస బ్యాలన్స్ లేకపోతే ఆ ఖాతాలు పనిచేయవు. దీన్ని మళ్లీ యాక్టివ్ చేయించుకోవాలంటే పెనల్టీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖాతాల్లో ఎంత కనీస బ్యాలన్స్ ఉండాలో తెలుసా?

పీపీఎఫ్..
పీపీఎఫ్ ఖాతాదారులు కనీస బ్యాలన్స్ రూ.500 కలిగి ఉండాలి. ఒకవేళ ఈ బ్యాలన్స్ లేకపోతే ఖాతా క్లోజ్ అవుతుంది. ఈ అకౌంట్లో కనీసం ఉండాల్సిన డబ్బులు కూడా ఉండకపోతే 2024 మార్చి 1 నుంచి ఖాతా క్లోజ్ అయిపోతుంది.

ఇదీ చదవండి: ISRO Recruitment 2024: పది పాసైనవారికి బంపర్ ఆఫర్.. ఇస్రోలో జాబ్స్.. రూ.80,000 జీతం..  

ఒకవేళ మార్చి 31లోగా కనీస బ్యాలన్స్ ఉండకపోతే మళ్లీ యాక్టివేట్ చేయడానికి ఏడాదికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. మీ ఖాతా కనీస బ్యాలన్స్ లేకుండా రెండేళ్లు గడిస్తే రూ.100 పెనల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పనిచేయని ఖాతాలు ఏ ఇతర బెనిఫిట్స్ కూడా పొందవు. ఎలాంటి లోన్ సదుపాయం కూడా కల్పించరు.

ఇదీ చదవండి: Post Office KVP : పోస్ట్‌ఆఫీస్ ఫుల్ పైసావసూల్ స్కీం.. లక్షకు రూ. 2 లక్షలు పక్కా..!

సుకన్య సమృద్ధి యోజన..
సుఖన్య సమృద్ధి యోజనకు ఉండాల్సిన కనీస బ్యాలన్స్ రూ.250. ఈ కనీస బ్యాలన్స్ లేకపోతే అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఇందులో కూడా పెనల్టీగా ప్రతి సంవత్సరానికి రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధియోజన కేంద్ర ప్రభుత్వం పథకం కింద 8.2  శాతం వడ్డీ అందిస్తోంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

ISROISRO Recruitment 2024ISRO Recruitment 2024 notification

Trending News