Car: డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేశారో.. మీ కారు షెడ్డుకు పోవాల్సిందే

Car Clutch Plate: కొంతమంది కారు నడిపితే ఏండ్లు గడుస్తున్నా..సూపర్ కండిషన్లో ఉంటుంది. కొన్ని కార్లు మాత్రం నెలల వ్యవధిలోనే షెడ్డు ఎక్కడంటూ వెతుక్కుంటూ వెళ్తాయి. తర్వాత బిల్లు చూస్తే ఓనర్ కళ్లు బైర్లుకమ్మాల్సిందే. దీనంతటికి కారణంగా డ్రైవర్ లోపమే అంటే మీరు నమ్మితీరాత్సిందే. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేస్తే మీ కారు త్వరగా పాడువుతుంది. ఆ తప్పులేంటో చూద్దాం. 

Written by - Bhoomi | Last Updated : Sep 26, 2024, 08:39 PM IST
Car: డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేశారో.. మీ కారు షెడ్డుకు పోవాల్సిందే

Car Clutch Plate: చాలా కార్లు త్వరగా పాడవుతుంటాయి. కారణం ఏంటదనేది ఓనర్లకు కూడా అర్ధం కాదు. అయితే సరిగ్గా డ్రైవింగ్  చేయకపోవడం వల్లే కారు త్వరగా రిపేర్ కు వచ్చిందని మెకానిక్స్ చెబుతుంటారు. డ్రైవింగ్ లో కొన్ని పొరపాట్లు చేస్తే కారు త్వరగా షెడ్డుకు పోతుంది. మరి కారు త్వరగా పాడవకుండా..మంచి కండిషన్లో ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. 

 క్లచ్ ప్లేట్ వైఫల్యానికి దారితీసే డ్రైవింగ్ తప్పులను చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే క్లచ్ ప్లేట్ రిపేర్ కు వస్తే చాలా ఖర్చు అవుతుంది. అంతేకాదు వెహికల్ పనితీరు ప్రభావం చూపుతుంది. క్లచ్ ప్లేట్‌ను దెబ్బతీసే ఐదు సాధారణ తప్పులు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూద్దాం. 

క్లచ్‌ను నొక్కి ఉంచడం:

చాలా మంది ట్రాఫిక్ లో కారు నడుపుతున్నప్పుడు లేదా ఆపేటప్పుడు క్లచ్‌ను సగం నొక్కి ఉంచుతారు. ఇలా క్లచ్  ను నొక్కడం వల్ల క్లచ్ ప్లేట్ జీవితకాలం తగ్గుతుంది. 

గేర్‌లను మార్చేటప్పుడు పూర్తిగా క్లచ్‌ని తొక్కపోవడం:

గేర్‌లను మార్చేటప్పుడు క్లచ్‌ను పూర్తిగా అణచివేయకపోవడం వల్ల క్లచ్ ప్లేట్ మరియు గేర్ బాక్స్ దెబ్బతింటాయి. దీని వల్ల క్లచ్ ప్లేట్ త్వరగా పాడైపోతుంది.

సడెన్ గా క్లచ్‌ను విడుదల చేయడం: 

క్లచ్ అకస్మాత్తుగా విడుదలైతే, అది ఇంజిన్,  ట్రాన్స్‌మిషన్ పై ప్రభావం చూపుతుంది. ఇది క్లచ్ ప్లేట్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇలా చేస్తే క్లచ్ త్వరగా పాడవుతుంది. 

Also Read: Best Smartphones Under 15000: దసరాకు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? 15వేల లోపు బెస్ట్ ఫోన్లు ఇవే ..అన్నీ టాప్ బ్రాండ్లే 

క్లచ్‌పై కాలితో డ్రైవింగ్: 

డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కాలును క్లచ్‌పై ఉంచే అలవాటు కూడా తప్పు. ఇది క్రమంగా క్లచ్ ప్లేట్ జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. 

క్లచ్‌ను అతిగా ఉపయోగించడం:

కారు స్పీడ్ తగ్గించడానికి లేదా పెంచడానికి క్లచ్ ను ఉపయోగిస్తారు. అయితే గేర్, బ్రేక్స్ ను సరిగ్గా ఉపయోగించాలి. ఈ అలవాటు క్లచ్ ప్లేట్ పై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇలా చేస్తే క్లచ్ ప్లేట్ త్వరగా పాడవుతుంది. 

కారును కొనుగోలు చేసేటప్పుడు మెయింటెన్స్ కు సంబంధించిన రూల్ బుక్ ను కంపెనీ ఇస్తుంది. అందులోని సూచనలను తప్పకుండా పాటిస్తుండాలి. ప్రతి 5వేల కిలోమీటర్ల కు ఒకసారి ఇంజన్ ఆయిల్ మార్చుతుండాలి. కూలెంట్, బ్రేక్ ఫ్లూయిడ్ వంటివి తరచుగా చెక్ చేసుకోవాలి. కారుతో స్టంట్స్ వేయడం, ఒక్కచేత్తో స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేయడం, సరిగ్గా క్లచ్ వేయకుండా గేర్ మార్చడం వంటివి అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు చేస్తే మీ చేజేతులా కారును పాడుచేసుకుంటున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. 
 

Also Read: Success Story: ఆమె సంకల్పం ముందు పేదరీకం ఓడింది.. ఆర్థిక కష్టాల్లో నుంచి పుట్టిన ఒక ఆలోచన.. ఆమె జీవితాన్నే మార్చేసింది  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News