Bank offers : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు బంఫర్ ఆఫర్.. 2 లక్షల వరకు ప్రయోజనం

Punjab National Bank 2 lakh rupees benefits : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జన్ ధన్ ఖాతాలు ఉన్న వారికి బీమాతో పాటు మరికొన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తోంది పీఎన్‌బీ. మరి ఆ సౌకర్యాలు ఏమిటో ఒకసారి చూద్దాం.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 04:55 PM IST
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
  • రూ.2 లక్షల వరకు బీమా పొందే అవకాశం
  • జన్ ధన్ ఖాతాలు ఉన్న ఖాతాదారులకు అవకాశం
Bank offers : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు బంఫర్ ఆఫర్.. 2 లక్షల వరకు ప్రయోజనం

Bank offers Punjab National Bank give 2 lakh rupees benefits to customers : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే రూ.2 లక్షల వరకు బీమా పొందొచ్చు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న వాళ్లందరికీ ఈ ఆఫర్ వర్తించదు. కేవలం జన్ ధన్ ఖాతాలు ఉన్న ఖాతాదారులకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. 

అంతేకాదు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో (Punjab National Bank‌) జన్ ధన్ ఖాతాలు (Jan Dhan account) ఉన్న వారికి బీమాతో పాటు మరికొన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తోంది పీఎన్‌బీ. మరి ఆ సౌకర్యాలు ఏమిటో ఒకసారి చూద్దాం.. 

2 లక్షల దాకా ప్రయోజనం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన జన్ ధన్ ఖాతాదారులకు.. PNB రూపే జన్‌ధన్ కార్డ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ కార్డుపై రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. ఇక రూపే కార్డ్‌ ను రెగ్యులర్ ఏటీఏం కార్డ్‌లా వినియోగించుకోవచ్చు. ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి... అలాగే ఆన్‌లైన్ కోనుగోళ్లకు తదితర వాటికి ఉపయోగించుకోవచ్చు. 

Also Read : Shocking video: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి 

330 ప్రీమియంతో 2 లక్షల బీమా

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) వార్షిక ప్రీమియం రూ. 330 ప్లాన్ కింద వినియోగదారులకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) లభిస్తుంది. ఈ మొత్తం మీ బ్యాంక్ ఖాతా నుండి ECS ద్వారా తీసుకుంటారు. ఈ ప్లాన్ కింద.. కస్టమర్లకు 2 లక్షల లైఫ్ కవర్ లభిస్తుంది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన PMSBY కూడా.. చాలా తక్కువ ప్రీమియంతో జీవిత బీమాను అందిస్తుంది. PMSBY కూడా కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ఈ స్కీమ్ (Scheme) కింద ఖాతాదారుడు కేవలం రూ. 12కే రూ. 2 లక్షల జీవిత బీమా కవరేజీని (Life Insurance) పొందొచ్చు.

Also Read : Diego Maradona Watch:మారడోనా లగ్జరీ వాచీ-దుబాయిలో చోరీ-ఇండియాలో దొరికింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News