MG ZS EV SUV car: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. రన్నింగ్ కాస్ట్ కిమీకు 60 పైసలు మాత్రమే

MG ZS EV SUV car Price, Features and Range : ఎంజీ మోటార్ ఇండియా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది.  MG ZS EV పేరిట లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టన్స్ సిస్టమ్స్ లెవెల్-2 ఫీచర్‌తో వస్తోంది. ఇంకెన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఈ కారు సొంతం. అవేంటో తెలుసుకుందాం రండి.

Written by - Pavan | Last Updated : Jul 13, 2023, 01:32 AM IST
MG ZS EV SUV car: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. రన్నింగ్ కాస్ట్ కిమీకు 60 పైసలు మాత్రమే

MG ZS EV SUV car Price, Features and Range : ఎంజీ మోటార్ ఇండియా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది.  MG ZS EV పేరిట లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టన్స్ సిస్టమ్స్ లెవెల్-2 ఫీచర్‌తో వస్తోంది. పరిమిత కాలం ఆఫర్ కింద రూ. 27.89 లక్షల ధరకే ఈ కొత్త ఈవీ కారు లభించనుంది.

MG ZS EV లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టన్స్ సిస్టమ్స్ సాంకేతికత మూడు స్థాయిల్లో ఒక హెచ్చరికలా పనిచేస్తుంది. హాప్టిక్, ఆడియో, విజువల్ అలర్ట్స్ ప్రయాణీకుల డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు సేఫ్టీని కూడా పెంపొదిస్తుంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టన్స్ సిస్టమ్స్ ప్యాకేజీలో భాగంగా ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ , స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ వంటి అధునాతన పరిజ్ఞానంతో కూడిన ఫీచర్స్ ఉన్నాయి. ఇవేకాకుండా, డ్రైవర్‌కి శ్రమను తగ్గిస్తూ లేన్ ఫంక్షన్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సైతం అందుబాటులో ఉన్నాయి. 

MG ZS EV ఎలక్ట్రిక్ కారులో 50.3kWh అధునాతన ప్రిస్మాటిక్ బ్యాటరీ అమర్చారు. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 461 కిమీల రేంజ్ ఇస్తుంది. ప్రిస్మాటిక్ బ్యాటరీ అంటేనే బెస్ట్ రేంజ్ ఇవ్వడానికి పెట్టింది పేరు. అంతేకాకుండా 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా లభిస్తుండటం మరో విశేషం. ఎంజీ మోటార్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం.. MG ZS EV కారును ఉపయోగించేందుకు ఒక్కో కిమీకు 60 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఇతర కార్లతో పోల్చుకుంటే దీని రన్నింగ్ కాస్ట్ ఎంతో తక్కువ మాత్రమే కాకుండా ఇంకెంతో ధనం కూడా ఆదా చేస్తుందన్నమాట.

ICE పవర్‌ట్రెయిన్‌లపై నిర్మించిన SUV కార్లతో పోల్చుకుంటే.. ఈ ఎలక్ట్రిక్ కారు మూడు సంవత్సరాలలో రూ. 4,00,000 వరకు ఆదా చేస్తుంది. MG ZS EV కారు 8 లేయర్ హెయిర్‌పిన్ మోటార్ 176PS శక్తిని అందిస్తుంది. దీని ఫలితంగా కేవలం 8.5 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుటుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ కారు మూడు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది: అందులో ఒకటి ఎకో మోడ్ కాగా రెండోది నార్మల్ మోడ్. ఇక మూడోది స్పోర్ట్ మోడ్.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ కారు పూర్తి ఎల్ఈడీ హాకీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ డిజైన్ టచ్ ఇచ్చారు. MG ZS EVలో ఫిజికల్ కీ లేకుండానే కారును లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం, స్టార్ట్ చేయడం వంటి కామన్ ఫీచర్స్ ఉన్నాయి. 17.78 సెం.మీ, ఎంబెడెడ్ ఎల్సీడీ స్క్రీన్, 25.7 సెంటీమీటర్ల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో లభిస్తుంది. 360 డిగ్రీలు వీక్షించేలా కెమెరాతో వెనుక భాగంలో పార్కింగ్ సెన్సార్స్, హిల్ డిసెంట్ కంట్రోల్, వాహనంలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ ఉండటం విశేషం.

Trending News