EPFO Interest Rate 2024: పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి వడ్డీ డబ్బులు..!

EPF Interest Rate Credit Status: ఈపీఎఫ్‌లో ప్రస్తుతం 8.25 శాతం వడ్డీని ఖాతాదారులు అందుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా వడ్డీ జమ చేయలేదు. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈపీఎఫ్‌ఓ స్పందిస్తూ.. త్వరలోనే వడ్డీ జమ చేస్తున్నట్లు వెల్లడించింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 8, 2024, 03:23 PM IST
EPFO Interest Rate 2024: పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి వడ్డీ డబ్బులు..!

EPF Interest Rate Credit Status: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటును పెంచుతూ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రకటన చేసిన తెలిసిందే. గతేడాది 8.15 శాతం వడ్డీ రేటు ఉండగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికికి 8.25 శాతానికి పెంచింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీని ప్రభుత్వం ఇంకా జమ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ పీఎఫ్‌ ఖాతాదారుడు ఈపీఎఫ్‌ఓను ట్యాగ్ చేస్తూ వడ్డీ జమ ప్రక్రియకు సంబంధించి ట్విట్టర్‌లో ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నకు ఈపీఎఫ్‌ఓ సమాధానం ఇచ్చింది. వడ్డీని డిపాజిట్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని EPFO ​​తెలిపింది. 

Also Read: Varalaxmi sarath kumar: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ పెళ్లి ఖ‌ర్చు అన్ని కోట్లా?.. విస్మయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

అతి త్వరలో మీ అకౌంట్‌లో డబ్బు కనిపించే అవకాశం ఉందని రిప్లై ఇచ్చింది. వడ్డీని డిపాజిట్ చేసిన ప్రతిసారి.. దాని మొత్తం చెల్లింపు ఒకేసారి జమ అవుతుందని వెల్లడించింది. ఈపీఎఫ్‌పై ప్రభుత్వం అందుకున్న వడ్డీని జూలై 23 తరువాత బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని 28.17 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.  

ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పకుండా పొదుపు చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)ను ప్రారంభించింది. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు.. ఉద్యోగులకు పీఎఫ్ సదుపాయం కల్పించాలి. ఒక ఉద్యోగి అకౌంట్‌లో 12 శాతం కట్ అయితే.. కంపెనీ కూడా అంతే మొత్తాన్ని పీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తుంది. అయితే కంపెనీ డిపాజిట్ చేసిన డబ్బులో 3.67 శాతం EPF ఖాతాలో జమ అవుతుంది. మిగిలిన 8.33 శాతం పెన్షన్ స్కీమ్ (EPS)లో జమ అవుతుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. 

Also Read: Varalaxmi sarath kumar: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ పెళ్లి ఖ‌ర్చు అన్ని కోట్లా?.. విస్మయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News