EPFO Withdrawal: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. కోవిడ్-19 (Covid-19) అత్యవసర పరిస్థితుల్లో...మీ పీఎఫ్ ఖాతా నుంచి రెట్టింపు డబ్బు విత్ డ్రా చేసుకోనే సదుపాయం కల్పించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO). కేవలం గంటల వ్యవధిలోనే డబ్బు బదిలీ చేయబడుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలో రోజుకు రెండు లక్షలకుపైగా కేసులు నమోదవతున్నాయి. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... EPFO చందాదారుల కోసం తిరిగి చెల్లించని అడ్వాన్స్‌ను రెండుసార్లు ఉపసంహరించుకునే అవకాశాన్ని కొనసాగించింది. ఖాతాదారులు EPFO ఆన్‌లైన్ పోర్టల్ ఉపయోగించి తమ పీఎఫ్ ఖాతాల నుండి రెండుసార్లు అడ్వాన్స్‌లను (EPFO Advance) సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, డబ్బును రెండుసార్లు విత్‌డ్రా చేసుకునే నిబంధనను మొదటగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY) పథకం కింద ప్రారంభించారు.
Also Read: IT Refund Status: మీ ఇన్‌కంటాక్స్ రిఫండ్ వచ్చిందా, రాలేదా..ఎలా చెక్ చేసుకోవాలి
డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే...
1. ముందుగా https://unifiedportal-mem.epiindia.gov.in/memberinterface/ పోర్టల్ ను ఓపెన్ చేయాలి.
2. మీ యూఏఎన్ (UAN) మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి పీఎఫ్ (PF) ఖాతాకు లాగిన్ చేయండి. ధృవీకరణ కోసం క్యాప్చా (Captcha) కోడ్‌ని నమోదు చేయండి.
3. తర్వాత 'ఆన్‌లైన్ సేవలు' (Online Services) విభాగానికి వెళ్లండి.
4. మీ క్లైయిమ్ ను ఎంచుకోండి(ఫారం-31, 19, 10C మరియు 10D).
5. ఇప్పుడు, మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి. వీటిలో మీ ఆధార్ నంబర్ యొక్క పేరు, పుట్టిన తేదీ మరియు చివరి నాలుగు అంకెలు ఉంటాయి.
6. మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంటర్ చేయండి. తర్వత 'వెరిఫై'పై (verify) క్లిక్ చేయండి.
7. 'సర్టిఫికేట్ ఆఫ్ అండర్‌టేకింగ్'ని (Certificate of Undertaking) షేర్ చేయండి.
8. ‘పీఎఫ్ అడ్వాన్స్ (ఫారం 31)’పై క్లిక్ చేయండి.
9. ‘అవుట్‌బ్రేక్ ఆఫ్ పాండమిక్ (COVID-19)’ ఫారమ్‌ను ఎంచుకోండి.
10. మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.
11. ఇప్పడు క్యాన్సల్ చేయబడిన చెక్కును, అడ్రస్ ఫ్రూవ్ ను అప్ లోడ్ చేయండి.
12. ఆధార్‌తో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని నమోదు చేయండి.
13. అనంతరం సబ్మిట్ (Submit) అప్షన్ పై క్లిక్ చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి