Diesel Cars Under Rs 10 Lakhs: రూ 10 లక్షల కంటే తక్కువకు లభించే టాప్ 5 డీజిల్ కార్లు ఇవే

Top 10 Diesel Cars: కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. బడ్జెట్, స్థోమతను బట్టి ఏ కారు తీసుకోవాలనేది నిర్ణయించుకుంటారు. బడ్జెట్ విషయం పక్కనబెడితే అందరూ మొదటి ప్రాధాన్యత మాత్రం డీజిల్ కార్లకే ఇస్తుంటారు. దేశంలో టాప్ 5 డిజిల్ కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 3, 2023, 07:27 PM IST
Diesel Cars Under Rs 10 Lakhs: రూ 10 లక్షల కంటే తక్కువకు లభించే టాప్ 5 డీజిల్ కార్లు ఇవే

Top 5 Diesel Cars Under Rs 10 Lakhs in India:  దేశంలో పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లకు ఆదరణ ఎక్కువ. బహుశా మైలేజ్ అధికంగా ఇవ్వడమే దీనికి కారణం కావచ్చు. పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్లు మైలేజ్ ఎక్కువగా ఇస్తాయి. 10 లక్షల కంటే తక్కువ బడ్జెట్‌లో లభించే 5 డీజిల్ కార్ల వివరాలు ఇలా ఉన్నాయి..

పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లకే ఆదరణ ఎక్కువ. కారణం పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్లు మైలేజ్ ఎక్కువ ఇవ్వడంతో పాటు డీజిల్ ధరలో కూడా లీటర్‌కు 10 రూపాయల వరకూ వ్యత్యాసముంటుంది. అదే సమయంలో రీసేల్ విలువ కూడా డీజిల్ కార్లకే ఎక్కువ ఉంటుంది. ఈ నేపధ్యంలో మీరు కూడా డీజిల్ కారు వైపు మొగ్గు చూపిస్తుంటే..10 లక్షల్లోపు అందుబాటులో ఉన్న 5 డీజిల్ కార్ల గురించి తెలుసుకుందాం..

టాటా నెక్సాన్ డీజిల్

ఇందులో 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజన్ 113 బీహెచ్‌పి, 160 ఎన్ఎం టార్క్‌తో వస్తుంది. ఇందులో 6 స్పీడ్ ఎంటీ, ఏఎంటీ ఆప్షన్ ఉంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ మరో ప్రత్యేకత. ఈ కారు ధర 9.99 లక్షల నుంచి ప్రారంభమౌతుంది.

టాటా ఆల్ట్రోజ్ డీజిల్

టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఇదొక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. అదే సమయంంలో దేశంలో అందుబాటులో ఉన్న కార్లలో  అత్యంత చౌకైన డీజిల్ కారు ఇదే. ఇందులో 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజన్ 88 బీహెచ్‌పి, 200 ఎన్ఎం టార్క్‌తో వస్తుంది. ఇందులో  5 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఈ కారు ధర 8.15 లక్షలతో ప్రారంభమౌతుంది.

Also Read: Cheapest Bike: డెడ్‌ ఛీప్‌ ధరలతో అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌ ఇదే..లీటర్‌కు మైలేజీ ఎంతిస్తుందో తెలుసా?

కియా సోనెట్ డీజిల్

కియా సోనెట్ డీజిల్ చాలా వేగంగా ప్రాచుర్యం పొందిన కారు. ఇందులో పవర్ ట్రేన్ ఆప్షన్లు చాలా ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 113 బీహెచ్‌పి , 250 ఎన్ఎం టార్క్  కలిగి ఉంది. డీజిల్ ఇంజన్‌తో పాటు ఐఎంటీ, 6 స్పీడ్ ఏటీ ఆప్షన్ కూడా ఉంది. ఈ కారు ధర 9.95 లక్షలతో ప్రారంభమౌతుంది.

మహీంద్ర బొలేరో, మహీంద్ర బొలేరో నియో

మహీంద్రా బొలేరో చాలా ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ. మహీంద్రా కంపెనీ టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీ కూడా ఇదే. బొలేరో పేరుతో రెండు ఎస్‌యూవీలు బొలోరో, బొలేరో నియో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండూ 7 సీటర్ డీజిల్ కార్లు. రెండింట్లోనూ 1.5 లీటర్ టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. రెండింట్లోను పవర్ అవుట్‌పుట్ వేర్వేరుగా ఉంటుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉంది. ఈ కార్ల ధర 9.62 లక్షలతో ప్రారంభమౌతుంది. 

మహీంద్ర ఎక్స్‌యూవీ 300 డీజిల్

మహీంద్ర ఎక్స్‌యూవీ 300 డీజిల్ కారులో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. 1.5 లీటర్ టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 115 బీహెచ్‌పి, 300 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారుతో 6 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ , 6 స్పీడ్ ఏఎంటీ ఆప్షన్ ఉంటుంది. ఈ కారు ధర 9.90 లక్షలతో ప్రారంభమౌతుంది. 

Also Read: Flipkart Offers: ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త, 80 వేల ఐఫోన్ 14 ఇప్పుడు కేవలం 34 వేలకే, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News