FD Interest Rates: ఎఫ్‌డీపై అత్యధికంగా 9.60 శాతం వడ్డీ ఇచ్చే బ్యాంకులివే

FD Interest Rates: బ్యాంకులైనా లేదా పోస్టాఫీసులైనా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకు ఆదరణ ఎక్కువ. రిటైర్ అయిన ఉద్యోగులు తమ భవిష్యత్ కోసం ఎక్కువగా ఎఫ్‌డీ చేస్తుంటారు. ఇంకొందరు పిల్లల భవిష్యత్ కోసం ఎఫ్‌డి చేస్తుంటారు. కారణం ఏదైనా ఎఫ్‌డిలు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌గా ఉంటున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2024, 05:39 PM IST
FD Interest Rates: ఎఫ్‌డీపై అత్యధికంగా 9.60 శాతం వడ్డీ ఇచ్చే బ్యాంకులివే

FD Interest Rates: ఎఫ్‌డీలపై వివిధ బ్యాంకులు వివిధ రకాలుగా వడ్డీ చెల్లిస్తుంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు ఒకలా, ప్రైవేట్ బ్యాంకులు మరోలా వడ్డీ అందిస్తుంటాయి. ఈ రెండూ కాకుండా ప్రైవేట్ చిన్న తరహా బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తుంటాయి. ఇందులో ఎక్కువగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలుంటాయి. ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ అందిస్తున్న అలాంటి చిన్న తరహా బ్యాంకులేంటో చూద్దాం.

భవిష్యత్ కోసం మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్‌పై భారీగా రిటర్న్స్ కావాలనుకుంటే నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ సంస్థలు మంచి ప్రత్యామ్నాయం. వీటిలో రిస్క్ ఎంత వరకూ ఉంటుందనేది తెలియకపోయినా రిటర్న్స్ అధికంగా ఉంటాయి. అందుకే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేముందు ఏ బ్యాంకులో అత్యధిక వడ్డీ ఉందో చెక్ చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకంటే సాధారణంగా చిన్న తరహా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుంటాయి. ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న 5 చిన్న తరహా బ్యాంకులేంటో తెలుసుకుందాం.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంకు సాధారణ పౌరులకు 888 రోజుల ఎఫ్‌డీపై అత్యధికంగా 8.50 శాతం వడ్డీ ఇస్తుంటే సీనియర్ సిటిజన్లకు మాత్రం 9 శాతం వడ్డీ అందిస్తోంది. 

ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇందులో సాధారణ కస్టమర్లకు 2-3 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 8.50 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఇక సీనియర్ సిటిజన్లకు అయితే 9 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. 

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంకులో సాధారణ ప్రజలకు అత్యధికంగా 9.10 శాతం వడ్డీ ఉంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే ఏకంగా 9.60 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. చిన్న తరహా ప్రైవేట్ బ్యాంకుల్లో ఇదే అత్యదిక వడ్డీ. అయితే ఈ వడ్డీ 5 ఏళ్ల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలకు వర్తిస్తుంది. 

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ బ్యాంకులో సాధారణ ప్రజలకు 1000 రోజుల వరకూ ఎఫ్‌డీపై 8.51 శాతం వడ్డీ అందుబాటులో ఉంటే.. సీనియర్ సిటిజన్లకు 9.11 శాతం వడ్డీ లభిస్తోంది. 

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇందులో 1001 రోజుల కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 9 శాతం, సీనియర్ సిటిజన్లకు 9.50 శాతం వడ్డీ లభిస్తోంది. 

Also read: EPFO New Rule: పీఎఫ్ అడ్వాన్స్ 3 రోజుల్లోనే పొందాలంటే ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News