Russia - Ukraine Conflict: యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఉక్రెయిన్‌లో గురువారం (ఫిబ్రవరి 17) కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. రష్యా ప్రోద్బలంతో అక్కడి వేర్పాటు వాదులే ఈ కాల్పులకు పాల్పడినట్లు చెబుతున్నారు. నియంత్రణ రేఖ వెంబడి ఉక్రెయిన్ బలగాలపై కాల్పులకు తెగబడ్డ వేర్పాటు వాదులు.. ఈ క్రమంలో ఓ నర్సరీ స్కూల్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
యూరోప్‌కి చెందిన ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ సంస్థ ప్రకారం... తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బస్ ప్రాంతంలో గురువారం పలుచోట్ల కాల్పులు చోటు చేసుకున్నాయి. స్టానిట్సియా లుహాన్స్కాలోని ఓ కిండర్‌గార్టెన్ స్కూల్‌ను వేర్పాటు వాదులు టార్గెట్ చేశారు. స్కూల్లో చిన్నారుల్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో.. స్కూల్ జిమ్‌పై కాల్పులకు పాల్పడ్డారు.
మరో 15 నిమిషాల్లో చిన్నారులు జిమ్ క్లాస్‌కి హాజరుకావాల్సి ఉంది. ఒకవేళ జిమ్ క్లాస్ ముందు గానే నిర్వహించి ఉంటే తీరని నష్టం జరిగే ఉండేదని స్కూల్ టీచర్లు వాపోయారు. స్కూల్లో బాంబ్ షెల్టర్ లేదని.. దీంతో తమ పిల్లలకు ఏం జరిగిందోనని ఆందోళన చెందామని ఓ విద్యార్థి తల్లి వాపోయింది. కాల్పుల్లో స్కూల్ భవనం చాలావరకు ధ్వంసమవగా... ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
స్టానిట్సియా లుహాన్స్కా నగరంలో వేర్పాటువాదులు మొత్తం 32 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఉక్రెయిన్ మిలటరీ వెల్లడించింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కాల్పులు జరిగినట్లు తెలిపింది. స్కూల్‌పై కాల్పులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉక్రెయిన్‌ను రెచ్చగొట్టేందుకే రష్యా ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఎంపీ మరియా మెజెంటా ఆరోపించారు.
తాజా కాల్పుల ఘటనతో ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణమైనా దాడులకు తెగబడువచ్చుననే ప్రచారం మరింత ఊపందుకుంది. మరోవైపు ఈ కాల్పుల ఘటన వెనుక రష్యా ఉందనే ప్రచారాన్ని ఆ దేశం ఖండించింది. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి ఇప్పటికే తాము కొంత బలగాలను ఉపసంహరించుకున్నామని పేర్కొంది. అయితే సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకునేందుకు మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ ఎలాంటి చర్యలకు దిగబోతున్నారన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఫిబ్రవరి 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయవచ్చునని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించగా.. పుతిన్ దాన్ని ఖండించిన సంగతి తెలిసిందే.
A video taken from inside the targeted kindergarten building. pic.twitter.com/hCpOoWCkhA
— Illia Ponomarenko (@IAPonomarenko) February 17, 2022
Also Read: Horoscope Today Feb 18 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి తోబుట్టువుల నుంచి శుభవార్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.