Realme 9 Pro+ 5G: మీరు బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు..తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే వెంటనే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లాగిన్ కావల్సిందే. 25 వేల రూపాయల రియల్‌మి 9 ప్రో ప్లస్ 5జి స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం..8 వేలకే పొందవచ్చు. ఈ ఆఫర్ ఎలాగంటే..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌కు మరో 24 గంటలే మిగిలుంది. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆగస్టు 10వ తేదీన అంటే రేపటితో ముగుస్తోంది. శాంసంగ్, ఐఫోన్, రెడ్‌మి, రియల్‌మి, వివో, ఒప్పో, వన్‌ప్లస్ వంటి లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది కంపెనీ. కంపెనీ అందించే ఆఫర్లు కాకుండా బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వర్తించనుంది. అన్నీ కలుపుకుంటే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై మీరు ఊహించని ఆఫర్ లభ్యమౌతుంది.
ఇందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 9 ప్రో ప్లస్ 5జిపై ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ఫోన్ లాంచింగ్ ధర 27,999 రూపాయలు కాగా 10 శాతం డిస్కౌంట్ అనంతరం 24,999 రూపాయలకు లభ్యమౌతుంది.ఇక ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే అదనంగా మరో పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మరో 2499 రూపాయలు తగ్గుతుంది. ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్ ధర 22,499 రూపాయలకు అందుబాటులో వస్తుంది. ఇక మరోవైపు పాత స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్ ధర 17 వేల వరకూ ఉంది. అది మీ పాత ఫోన్ కండీషన్, మోడల్‌ను బట్టి ఉంటుంది. ఒకవేళ మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ పూర్తిగా వర్తిస్తే..27,999 రూపాయల రియల్‌మి 9 ప్రో ప్లస్ 5జి స్మార్ట్‌ఫోన్ కేవలం..5499 రూపాయలకే లభ్యమౌతుంది.
రియల్‌మి 9 ప్రో ప్లస్ 5జి ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 6 జిబి, 8 జిబి ర్యామ్‌లతో రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. స్టోరేజ్ కూడా 128 జీబి, 256 జీబిల్లో అందుబాటులో ఉంది. 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. త్రిపుల్ కెమేరా 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్‌తో పాటు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రోసెసర్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్..4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ రేపు రాత్రి 12 గంటలతో ముగుస్తుంది. అంటే ఈ ఆఫర్ మరో 24 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే మంచి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే త్వరపడండి. లేకపోతే ఆఫర్ మిస్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook