Flipkart Smart TV Offers: రూ.41 వేల విలువైన 50 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.9 వేలకే కొనొచ్చు!

Flipkart Smart TV Offers: ప్రముఖ స్మార్ట్ టీవీలపై ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక సేల్ ను ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచి సాగుతున్న ఈ సేల్ లో ప్రముఖ స్మార్ట్ టీవలపై భారీ తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. దీంతో దాదాపుగా రూ. 41 వేల విలువైన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ. 9 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.    

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 06:06 PM IST
Flipkart Smart TV Offers: రూ.41 వేల విలువైన 50 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.9 వేలకే కొనొచ్చు!

Flipkart Smart TV Offers: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. స్మార్ట్ టీవీలపై ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమైన 19 వరకు కొనసాగునుంది. ఈ సేల్ లో బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీలను చౌకగా విక్రయిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సూపర్ డీల్ గురించి మీకు చెప్పబోతున్నాం. ఈ సేల్ ద్వారా 50 అంగుళాల స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 9 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

50 - అంగుళాల స్మార్ట్ టీవీపై ఆఫర్..

థామ్సన్ OATHPRO సిరీస్ కు చెందిన 126 సెం.మీ (50 - అంగుళాల) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ. 40,999 ధరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ విక్రయంలో ఈ స్మార్ట్ టీవీని 31% తగ్గింపుతో అంటే రూ. 27,999 ధరకు విక్రయిస్తున్నారు. అయితే మీరు ఈ టీవీని కొనుగోలు చేసేటప్పుడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. అంటే బ్యాంక్ ఆఫర్ ద్వారా అత్యధికంగా రూ. 1,250 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 26,749 వద్దకు చేరుతుంది. 

దీంతో పాటు థామ్సన్ OATHPRO సిరీస్ 50 - అంగుళాల అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా మీ పాత స్మార్ట్ టీవీని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా రూ. 18 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ తగ్గింపు తర్వాత స్మార్ట్ టీవీ ధర రూ. 8,749 వద్దకు చేరుతుంది. 

థామ్సన్ OATHPRO స్మార్ట్ టీవీ ఫీచర్లు

డిస్ ప్లే - 50-అంగుళాల డిస్‌ప్లే, 3,840 x 2,160 పిక్సెల్‌ల అల్ట్రా HD 4K

స్మార్ట్ టీవీ టైప్ - ఆండ్రాయిడ్

రిఫ్రెష్ రేట్ - 60 Hz

సౌండ్ అవుట్ పుట్ - 30 W

వీటితో పాటు ఈ ఆండ్రాయిడ్ టీవీలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వంటి యాప్ లు కూడా వీక్షించవచ్చు.  

Also Read: Jio 4G Smartphone: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం.. ఉచితంగా Jio 4G స్మార్ట్ ఫోన్!

Also Read: Travel with Platform Ticket: ఇకపై రిజర్వేషన్ లేకుండానే ప్లాట్ ఫారమ్ టికెట్ తో రైళ్లలో ప్రయాణించవచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News