March 18th 2022 Gold and Silver Rates In Hyderabad: ఉక్రెయిన్, రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావం ఇతర దేశాలపై భారీగానే పడింది. ముఖ్యంగా బ్యారెల్ ధర, తులం బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ వచ్చాయి. ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండే భారత్‌లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. యుద్ధం మొదలయ్యాక బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. ఓ సమయంలో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 53 వేలకు పైగా వెళ్లింది. అయితే గత 3-4 రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు మాత్రం స్వల్పంగా పెరిగాయి.
శుక్రవారం (మార్చి 18) బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 మేర పెరిగింది. మరోవైపు వెండి ధరలు రూ. 2100 మేర పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.69,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా ఉంది. వాణిజ్య నగరం ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,140గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,510 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,450.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ. 2100 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,900లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.72,900లుగా కొనసాగుతోంది.
Also Read: Today Horoscope March 18 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు చేయని పొరపాటుకు శిక్ష అనుభవిస్తారు!!
Also Read: Snakes Viral Video: మూడు పాములను ఒకేసారి ఆడించబోయాడు.. పడగవిప్పిన పాము ఏం చేసిందో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook