Job Offers: అనుభవం అవసరం లేదు..సీవి అక్కర్లేదు. ఏకంగా 55 వేల జీతంలో ఉద్యోగాలు. ఈ ఆఫర్ వింటే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. కరోనా మహమ్మారి అనంతరం చేసిన ఓ సర్వేలో తేలిన విషయమిది. కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావం పడింది పర్యాటక రంగంపై. ఎందుకంటే దాదాపు రెండేళ్ల వరకూ పర్యాటక రంగం మూతపడి ఉంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తరువాత మాంద్యం ప్రభావం కన్పిస్తోంది. ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం తిరిగి కోలుకుంటున్న పరిస్థితి కన్పిస్తోంది. అంతేకాదు ఈ రంగంలో ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి. పర్యాటక రంగంలో వేకెన్సీల విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
పర్యాటకరంగంలో యూరోప్ అగ్రస్థానంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది పర్యాటక ప్రాంతాలు చూసేందుకు యూరోప్ వస్తుంటారు. కోవిడ్ నేపధ్యంలో అదంతా నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉండటంతో తిరిగి పర్యాటక రంగం ఊపందుకుంటోంది. హోటల్, రెస్టారెంట్‌లో సర్వీసింగ్ కష్టంగా మారింది. ఎందుకంటే హోటళ్లు, రెస్టారెంట్లు, బార్ అండ్ పబ్స్‌లో వేకెన్సీలు చాలా పడి ఉన్నాయి. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని..హోటల్, రెస్టారెంట్ రంగంలో ఏ విధమైన అనుభవం చూడకుండా..ఎటువంటి సీవీలు పరిశీలించకుండానే ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. యూరోప్‌లోని అతిపెద్ద హోటల్ సంస్థ ఎక్కార్ కూడా ఏ విధమైన అనుభవం లేనివారిని రిక్రూట్ చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 110 కంటే ఎక్కువ దేశాల్లో పర్యాటక, హోటల్ రంగంలో 35 వేల సిబ్బంది అవసరముంది. కొత్తగా రిక్రూట్ చేసుకునేవారిని ఆరు గంటల ప్రత్యేక శిక్షణతో పనిలో తీసుకుంటున్నారు. సిబ్బంది కొరత కారణంగా..స్పెయిన్, పోర్చుగల్‌లో పర్యాటక రంగంపై ప్రభావం పడుతోంది. ఇక ఆతిధ్య రంగంలో స్పెయిన్‌లో 2 లక్షల సిబ్బంది కొరత వెంటాడుతోంది. నెలకు 94 వేల 884 రూపాయల జీతంతో సిబ్బందిని నియమించుకుంటున్నారు.
Also read: BSNL Plans: భారంగా మారుతున్న బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్, అదనపు ప్రయోజనాలు తొలగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook