Revanth Reddy: సీఎం, మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారు.. పిండ ప్రదానం చేయండి: రేవంత్ రెడ్డి

Revanth Reddy Visits Uppal and LB Nagar: ప్రగతి భవన్ చిల్లర రాజకీయాలకు వేదికగా మారిందంటూ ఘాటు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. వరదలపై ముందస్తుగా సీఎం సమీక్షలు చేయలేదని.. మంత్రి కేటీఆర్‌కు ప్రజల ప్రాణాలపై శ్రద్ధలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 29, 2023, 04:42 PM IST
Revanth Reddy: సీఎం, మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారు.. పిండ ప్రదానం చేయండి: రేవంత్ రెడ్డి

Revanth Reddy Visits Uppal and LB Nagar: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రతీ ఏటా వరదలు రావడం.. ప్రభుత్వం మరిచిపోవడం పరిపాటిగా మారిందన్నారు. పాలకుల కక్కుర్తి వల్లే  కాలనీలు వరదల్లో మునిగిపోయాయని.. నిజాం కాలం నాటి చెరువులన్నీ 90 శాతం బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. చెరువుల ఆక్రమణలతో కాలనీలు వరదల్లో మునిగిపోయాయని అన్నారు. హైదరాబాద్ నగరంపై కేటీఆర్‌వి ఆర్భాటపు ప్రకటనలేనని.. హైదరాబాద్ నగరం పరిస్థితి మేడిపండు చందంగా మారిందన్నారు. శనివారం ఎల్బీనగర్‌, ఉప్పల్ వరద ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

"వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ముందస్తుగా వరదలపై సీఎం సమీక్షలు చేయలేదు. ప్రగతి భవన్ చిల్లర రాజకీయాలకు వేదికగా మారింది. కేటీఆర్‌కు విలాసాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు. రియల్ ఎస్టేట్‌లో అభివృద్ధి కోసమే ఎల్బీనగర్‌లో సుధీర్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన మూసీకి చైర్మన్ అయి.. నియోజకవర్గ ప్రజలను మూసీలో ముంచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించాలి. 

వరదల్లో నష్టపోయిన వారికి తాత్కాలిక నష్ట పరిహారంగా రూ.15వేలు ఇవ్వాలి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించి ఆర్థిక సాయం చేయాలి. రాష్ట్రంలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించాలి. ఇసుక మేటలతో నిండిన వ్యవసాయ భూములకు రూ.20 వేలు అందించాలి. రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది.. సీఎం, మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి వరద నీటిలో పిండ ప్రదానం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నా.." అని రేవంత్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 వేల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారు. కేంద్రం తక్షణ వరద సాయంగా వెయ్యి కోట్లు విడుదల చేయాలన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చెల్లవని.. ఇంత జరుగుతున్నా కిషన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ప్రాంతంతో ఆయనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి పరిస్థితిని కిషన్ రెడ్డి ప్రధానికి వివరించాలని కోరారు. పార్లమెంట్‌లో అమిత్ షాను కలిసి వరద నష్టంపై నివేదిక ఇస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు రేవంత్ రెడ్డి.

Also Read: Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ టీమ్ రెడీ.. బండి సంజయ్‌కు ప్రమోషన్  

Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News