GST collection: గత నెలలో (2021 డిసెంబర్) వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ మొత్తం వసూళ్లు రూ.1.29 కోట్లపైనే నమోదవడం (GST collection in December) గమనార్హం. జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం ఇది వరుసగా ఆరో నెల.
జీఎస్టీ వసూళ్లు నవంబర్ నెలలో రూ.1.31 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
క్రితం ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే.. జీఎస్టీ వసూళ్లు 13 పెరిగాయి. 2019 డిసెంబర్‌తో పోలిస్తే 26 శాతం అధికంగా వసూళ్లు నమోదయ్యాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.30 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్ల సగటు రూ.1.10 లక్షల కోట్లుగా ఉంది. రెండో త్రైమాసికంలో సగటున రూ.1.15 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
డిసెంబర్లో వసూళ్లు ఇలా..
గత నెలలో మొత్తం రూ.1,29,78 కోట్లు వసూలయ్యాయి. అందులో కేంద్ర సీజీఎస్టీ (కేంద్ర జీఎస్టీ) రూ.22,578 కోట్లు(CGST collection in December). రాష్ట్రాల జీఎస్టీ వాటా (ఎస్జీఎస్టీ) రూ.28,658 కోట్లు(SGST collection in December). సమీకృత జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదైనట్లు (IGST collection in December) ఆర్థిక శాఖ పేర్కొంది. సెస్‌ల రూపంలో రూ.9,389 కోట్లు గడించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
Also read: LPG Price: న్యూ ఇయర్ రోజు గుడ్ న్యూస్- తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు!
Also read: ATM Charges : ఏటీఎం విత్ డ్రా కొత్త ఛార్జీలు.. నేటి నుంచి పెరగనున్న ఛార్జీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook