Hindenhurg Report: మొన్న అదానీ..ఇప్పుడు కోటక్, సెబీపై తీవ్ర ఆరోపణలు

Hindenhurg Report: ప్రపంచ కుబేరుల్లో ఒకడైన గౌతమ్ అదానీపై తీవ్రమైన షేర్ మార్కెట్ అవకతవకల ఆరోపణలతో సంచలనమైన హిండెన్‌బర్ మరోసారి చర్చనీయాంశమౌతోంది. ఈసారి కోటక్ మహీంద్రపై ఆరోపణలు సంధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 3, 2024, 10:32 AM IST
Hindenhurg Report: మొన్న అదానీ..ఇప్పుడు కోటక్, సెబీపై తీవ్ర ఆరోపణలు

Hindenhurg Report: అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై నివేదికతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన హిండెన్‌బర్గ్ మరోసారి ఆరోపణలు చేసింది. ఈసారి అదానీ వ్యవహారానికి  కోటక్ మహీంద్ర కంపెనీని ముడిపెడుతూ విమర్శలు చేసింది. అంతేకాకుండా సెబీ సైతం కోటక్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. 

ప్రముఖ అమెరికన్ షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ గురించి ఇటీవలి కాలంలో చాలామందికి తెలిసింది. కారణం అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ నివేదిక విడుదల చేసింది. గత ఏడాది జనవరిలో విడుదల చేసిన ఈ నివేదికతో అదానీ గ్రూప్ తీవ్రంగా నష్టపోయింది. ఏకంగా 150 బిలియన్ డాలర్లకు షేర్ మార్కెట్ విలువ పడిపోయింది. అదానీ గ్రూప్‌పై తాము సంధించిన ప్రశ్నలు, ఆరోపణలకు ఆ సంస్థ నుంచి ఇంకా సరైన సమాధానం రాలేదని హిండెన్‌బర్గ్ స్పష్టం చేసింది. 

ఈసారి కోటక్‌పై ఆరోపణలు సంధించింది. అదానీ షేర్ల నుంచి ఇన్వెస్టర్లను రక్షించేందుకు కోటక్ ఒక ఆఫ్ షోర్ ఫండ్ సృష్టించిందనేది కొత్త ఆరోపణ. అదానీ షేర్లను షార్ట్ చేసినందుకు తమకు నోటీసులు పంపిన సెబీ..కోటక్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తోందంటూ సెబీపై విమర్శలు చేసింది. బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ మరో బ్రోకరేజ్ సంస్థతో కలిసి అధానీ షేర్లలో నష్టం నుంచి లాభాన్ని పొందేందుకు ఈ ఆఫ్ షోర్ ఫండ్ సృష్టించారని ఆరోపణ చేసింది. 

అదానీపై ఆరోపణలు చేసిన తమను బెదిరించేందుకు సెబీ షోకాజ్ నోటీసు పంపిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. అదే నోటీసులో కోటక్ పేరు ఎఁదుకు పెట్టలేదని ప్రశ్నించింది. ఓ పెద్ద పారిశ్రామికవేత్తను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. కోటక్ పేరును సైతం దాచిపెట్టేందుకు సెబీ కేవలం కే ఇండియా ఆపర్చునిటీస్ అని ఉదహరించిందని పేర్కొంది. అదానీ షేర్లను షార్టింగ్ చేసిన విషయాన్ని తాము అప్పుడే బయటపెట్టినట్టు హిండెన్‌బర్గ్ తెలిపింది. 

అదానీ గ్రూప్ వ్యవహారంలో హిండెన్ బర్గ్ కోటక్ బ్యాంక్ పై ఆరోపణలు చేయడంతో నిన్న ఆ సంస్థ షేర్లు 2 శాతం నష్టపోయాయి. ఇవాళ కూడా ఆ క్షీణత కొనసాగుతోంది. 

Also read: Investment Tips: ఇళ్లు లేదా స్థలం కొనుగోలు చేస్తున్నారా, ఈ 4 విషయాలు మర్చిపోవద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News