ITR Filing: గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుంది

ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసే సమయం ఆసన్నమౌతోంది. సరిగ్గా మరో 40 రోజులే గడువు మిగిలింది. ట్యాక్స్ పేయర్లు అందరూ విధిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 19, 2024, 04:36 PM IST
ITR Filing: గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుంది

ITR Filing: ఆదాయపు పన్నుశాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. నిర్ణీత గడువు జూలై 31లోగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయమని సూచిస్తోంది. ఒక్కోసారి ఆదాయపు పన్ను శాఖ గడువు తేదీ పొడిగిస్తుంటుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని సమాచారం. అందుకే ఇప్పటి వరకూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనివాళ్లు త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోంది.

చాలామంది ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తుంటారు. కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు. జీతం నుంచి టీడీఎస్ కట్ అవుతున్నప్పుడు రిటర్న్స్ ఫైల్ చేయకున్నా ఫరవాలేదని చాలామంది భావిస్తుంటారు. ఫామ్ 16లో అదెలాగూ ఉంటుందని కదా అని భావిస్తారు. కానీ ఇది సరైన విధానం కాదు. మీ ఆదాయం పరిధి కనీస ట్యాక్స్ పరిధి దాటితే తప్పనిసరిగా ప్రతి యేటా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. 

ఐటీ రిటర్న్స్ ఎవరెవరు ఫైల్ చేయాలి

2023-24 ఆర్ధిక సంవత్సరంలో ట్యాక్స్ పరిమితి 2.5 లక్షల రూపాయలు. అదే 60-80 ఏళ్ల వయస్సులోవారికి 3 లక్షల వరకూ ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 80 ఏళ్లు దాటినవారికి ఏడాదికి 5 లక్షల వరకూ ఆదాయంపై ట్యాక్స్ ఉండదు. కొన్ని అంశాల్లో మాత్రం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. 1 లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ బ్యాంక్ ఎక్కౌంట్లలో 1 కోటి రూపాయలు డిపాజిట్ చేస్తే తప్పకుండా ఐటీ రిటర్న్స్ పైల్ చేయాల్సిందే. ఏదైనా విదేశీ యాత్రకు 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెడితే అప్పుడు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాలి. విద్యుత్ బిల్లు 1 లక్ష కంటే ఎక్కువ చెల్లించినా రిటర్న్స్ పైల్ చేయాలి.

వ్యాపారుల అమ్మకాలు, టర్నోవర్ 60 లక్షలు దాటితే కచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అదే ఎవరైనా ప్రొఫెషనల్ గ్రాస్ ఆదాయం 10 లక్షలు దాటితే అప్పుడు కూడా రిటర్న్స్ పైల్ చేయాలి. మొత్తం డిడక్ట్ అయిన ట్యాక్స్ 25 వేలు దాటినా రిటర్న్స్ పైల్ చేయాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినా సరే ఐటీ రిటర్న్స్ ద్వారా సమాచారం అందించాలి. ఇది కాకుండా ఆర్ధిక ఇబ్బందులతో నష్టపోయినప్పుడు కూడా రిటర్న్స్ ఫైలింగ్‌లో చూపిస్తే వచ్చే ఏడాది ఆదాయంలో అది కాస్తా అడ్జస్ట్ అవుతుంది. 

గడువులోగా ఫైల్ చేయకుంటే

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ నిర్ణీత గడువు జూలై 31లోగా పైల్ చేయకుపోతే ఆ తరువాత జరిమానాతో డిసెంబర్ 31లోగా ఫైల్ చేయవచ్చు. అంటే జూలై 31 నుంచి డిసెంబర్ 31 మధ్యలో రిటర్న్స్ పైల్ చేస్తే పెనాల్టీ ఉంటుంది. 

Also read: PM Kisan 17th Installment: పీఎం కిసాన్ 17వ వాయిదా విడుదల, మీ ఎక్కౌంట్లో పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News