Hyundai Creta: భారతదేశ కార్ మార్కెట్ చాలా పెద్దది. అందుకే ప్రతి కార్ కంపెనీ మోడల్ ఇక్కడ తప్పకుండా అందుబాటులోకి వస్తుంది. దేశీయంగా ఉన్న కంపెనీలకు తోడు విదేశీ కంపెనీ కార్లు కూడా చాలా ఉన్నాయి. ఏదేమైనా ఎస్‌యూవీలకు ప్రస్తుతం డిమాండ్ నడుస్తోంది.
ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ ఎస్‌యూవీలపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, హ్యుండయ్ క్రెటా వంటి కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువగా టాటా నెక్సాన్ లేదా మారుతి బ్రెజాలో ఒక కారు అగ్రస్థానంలో ఉంటుంది. అయితే మే 2023 విక్రయాల ప్రకారం టాటా నెక్సాన్, మారుతి బ్రెజాలను దాటి పోయింది ఓ కంపెనీ ఎస్‌యూవీ. ఈ ఎస్‌యూవీ ధర 10.87 లక్షల రూపాయలు కాగా ఇందులో ఉన్న ఫీచర్లు అందర్నీ ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అదే హ్యుండయ్ క్రెటా. ఎస్‌యూవీ అనగానే టాటా నెక్సాన్ కంటే హ్యుండయ్ క్రెటా గుర్తొచ్చేలా చేస్తోంది ఈ కారు. మే నెల విక్రయాల్లో టాటా నెక్సాన్, మారుతి బ్రెజాలను దాటి మొదటి స్థానంలో నిలిచింది హ్యుండయ్ క్రెటా. పెనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కారు సొంతం.
మే 2023లో హ్యుండయ్ క్రెటా అత్యధికంగా విక్రయమైన ఎస్‌యూవీగా నిలిచింది. గత నెలలో హ్యుండయ్ క్రెటా 14, 449 యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుండయ్ కంపెనీకు కూడా క్రెటానే అత్యధిక విక్రయమౌతున్న కారు. ఇక టాటా మోటార్స్‌కు చెందిన టాటా నెక్సాన్ రెండవ స్థానంలో ఉంది. టాటా నెక్సాన్ కారు మే 2023లో 14,423 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. ఇక మారుతి సుజుకి బ్రెజా అనూహ్యంగా మూడవ స్థానానికి చేరుకుంది. ఈ కారు మే నెలలో 13,398 యూనిట్ల అమ్మకాలు సాధించింది.
హ్యుండయ్ క్రెటా ధర 10.87 లక్షల నుంచి ప్రారంభమై 19.20 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, ప్యానోరమిక్ సన్‌రూఫ్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్‌సి, వీఎస్ఎమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్, టీపీఎంఎస్, రేర్ పార్కింగ్ కెమేరా, ఏబీఎస్ విత్ ఈబీడీ ఫీచర్లు ఉన్నాయి.
Also read: Maruti Brezza: దేశంలో మారుతి సుజుకినే టాప్, అత్యధికంగా విక్రయమౌతున్న ఎస్‌యూవీ, ధర ఎంతంటే
హ్యుండయ్ క్రెటా ఒక పవర్ ఫుల్ ఎస్‌యూవీ అనడంలో సందేహం లేదు. ఎస్‌యూవీ మార్కెట్‌లో హ్యుండయ్ క్రెటా క్రేజ్ నడుస్తోంది. ఇంతకుముందు ఇందులో మూడు రకాల ఇంజన్ ఆప్షన్లు ఉండేవి. ఇప్పుుడు రెండే అందుబాటులో ఉన్నాయి. ఒకటి పెట్రోల్ కాగా రెండవది డీజిల్. ఈ కారు 1.5 లీటర్ 4 సిలెండర్ల డీజిల్ ఇంజన్ 116 పీఎస్, 250 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. అటు 1.5 లీర్ 4 సిలెండర్ పెట్రోల్ ఇంజన్ అయితే 115 పీఎస్ పవర్, 143.8 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది. అంతేకాకుండా ఇంటెలిజెట్ వేరియెబుల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఉంది.
Also read: Income Tax Returns: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ విషయాలు మర్చిపోవద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook