Infosys reappoints Salil Parekh ఇన్ఫోసిస్‌ సీఈవో కం ఎండీగా మళ్లీ స‌లీల్ ప‌రేఖ్‌ నియామకం

Edited by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 06:54 PM IST
  • ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా స‌లీల్ ప‌రేఖ్
  • స‌లీల్ ప‌రేఖ్ 2027 మార్చి 31 వ‌ర‌కు కొనసాగుతారని ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించింది
  • అంత‌ర్జాతీయంగా ఐటీ సేవ‌ల రంగంలో ఈయనకు 30 సంవత్సరాలకు పైగా అనుభ‌వం
 Infosys reappoints Salil Parekh ఇన్ఫోసిస్‌ సీఈవో కం ఎండీగా మళ్లీ స‌లీల్ ప‌రేఖ్‌ నియామకం

Infosys సాఫ్ట్ వేర్‌ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రపంచ అత్యుత్తమ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్‌ తన విజయ ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. ఈక్రమంలో ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా స‌లీల్ ప‌రేఖ్ తిరిగి నియమించుకుంది. సలీల్ పరేఖ్ రానున్న ఐదు సంవత్సరాల వరకు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. కొత్త సీఈఓ అండ్ ఎండీ నియామకాన్ని ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు  ఎక్స్చేంజ్‌ల‌కు తెలియజేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించింది.

ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా స‌లీల్ ప‌రేఖ్ 2027 మార్చి 31 వ‌ర‌కు కొనసాగుతారని ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించిన ప్రచురణ పత్రంలో పేర్కొంది. కేవలం అర్హత ఆధారంగానే ఈ నియామకాన్ని చేపట్టినట్లు వెల్లడించింది. ఈయనకు ఎవరి అండదండలు లేవని స్పష్టం చేసింది. ఇక ఇన్ఫోసిస్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వాళ్లలో ఎవ్వరితో ఆయనకు పరిచయం లేదని స్పష్టం చేసింది. ఎవరి రికమెండేషన్ లేదని తేల్చిచెప్పింది. ఉద్యోగుల శ్రమతో అప్రతిహతంగా సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోతూ ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న ఇన్ఫోసిస్‌ను మరింత విజయవంతంగా నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్నందుకే ఆయన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించింది.  

స‌లీల్ ప‌రేఖ్ గత నాలుగేండ్లుగా ఇన్ఫోసిస్ సీఈవో కం ఎండీగా కొనసాగుతున్నారు. సంస్థను లాభాల బాట పట్టించడంలో తనదైన పాత్ర పోషించారు. అటు మేనేజ్‌మెంట్‌కు ఇటు ఉద్యోగులకు మధ్య సంధాన కర్తగా ఉండడంతో మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ అంశాలన్నీ ఆయనకు కలిసి వచ్చాయి. దీనికి తోడు అంత‌ర్జాతీయంగా ఐటీ సేవ‌ల రంగంలో ఈయనకు 30 సంవత్సరాలకు పైగా అనుభ‌వం క‌లిగి ఉండడం కూడా ఈయనకు కలిసి వచ్చింది. గతంలో ఈయన క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటివ్ బోర్డు స‌భ్యుడిగా కూడా ప‌ని చేశారు. క్యాప్‌జెమినీలో 25 ఏండ్ల‌పాటు వివిధ క్యాట‌గిరీల్లో నాయ‌క‌త్వ పాత్ర పోషించిన ఆయన మెరుగైన పనితీరుతో సంస్థను లాభాల బాట పట్టించారు. ఆతర్వాత ఇన్ఫోసిస్‌లో చేరి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. బాంబే-ఐఐటీలో ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసుకున్న స‌లీల్ ప‌రేఖ్‌.. ఆతర్వాత ఉన్నత విద్యకోసం కార్న్‌వెల్ యూనివ‌ర్సిటీలో చేరి కంప్యూట‌ర్ సైన్స్‌తో పాటు మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌ల్లో ఎంటెక్ పూర్తి చేశారు. 

ALSO READ Flipkart Latest offers: ఫ్లిప్‌కార్ట్‌‌‌లో స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్.. రూ.60 వేలు విలువ చేసే ఈ టీవీ కేవలం రూ.21 వేలకే

ALSO READ SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులరా..బీ అలర్ట్..హెచ్చరికలు జారీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x