iPhone 14 Price Drop: రూ.14 వేలకే iPhone 14..ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే!

మొబైల్ లలో ఐఫోన్ కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఐఫోన్ కి ఉన్నంత క్రేజ్ మారె ఏ ఇతర మొబైల్ కు లేదన్న మాట వాస్తవమే. ఐఫోన్ 15 సిరీస్ ను విడుదల చేసేందుకు సిద్ధమైన క్రమంలో ఐఫోన్ 14 ధర తగ్గింది. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2023, 04:32 PM IST
iPhone 14 Price Drop: రూ.14 వేలకే iPhone 14..ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే!

iPhone 14 Price Drop: ప్రముఖ మొబైల్ కంపెనీ సంస్థ యాపిల్ తమ కొత్త సిరీస్ ఐఫోన్ 15 సిరీస్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 12న మార్కెట్లలోకి రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కొత్త మోడల్ వచ్చిన వెంటనే.. పాత మోడళ్ల ధరలు భారీగా తగ్గుముఖం పడతాయి. అయితే ఈ సారి మాత్రం ఐఫోన్ 15 లాంఛింగ్ కు ముందే ఐఫోన్ 14 ధరను భారీగా తగ్గించింది. అయితే ఇంత తగ్గింపు ధరతో అమ్మకాన్ని పెట్టింది యాపిల్ సంస్థ అయితే కాదు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపును ప్రవేశపెట్టింది. మార్కెట్ ధర కంటే చాలా అంటే చాలా తక్కువ ధరకే ఐఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడే తెలుసుకుందాం. 

ఐఫోన్ 14 డిస్కౌంట్ ఆఫర్:
ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం మొబైల్స్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. సెప్టెంబరు 3న ప్రారంభమైన ఈ సేల్.. ఈ నెల 9 వరకు ఉంటుంది. ఇందులో యాపిల్ ఐఫోన్ 14 మోడల్ అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసింది. 

ఐఫోన్ 14 సిరీస్ మార్కెట్ అసలు ధర రూ.79,900గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో మాత్రం 14 శాతం డిస్కౌంట్ తో రూ. 67,999 కే అమ్మకానికి ఉంచారు. ఈ డిస్కౌంట్ ద్వారా మీరు రూ. 11,901 డిస్కౌంట్ పొందవచ్చు. అంతే కాకుండా ఈ కొనుగోలుపై మరో ప్రత్యేకమైన ఆఫర్ కూడా వర్తిస్తుంది. 

Also Read: Savings Account: మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతున్నాయా..? వెంటనే ఇలా చేయండి  

ఐఫోన్ 14 బ్యాంకు ఆఫర్:
యాపిల్ ఐఫోన్ 14 మోడల్ ని కొనుగోలు చేయడానికి HDFC బ్యాంకు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే.. మీరు అత్యధికంగా రూ. 4 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత మొబైల్ ధర రూ. 63,999కు చేరుకుంటోంది. దీంతో పాటు మరో ఆసక్తికరమైన ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు. 

ఐఫోన్ 14 ఎక్స్ఛేంజ్ ఆఫర్: 
యాపిల్ ఐఫోన్ ఎక్స్ఛేంజ్ సమయంలో మీ పాత మొబైల్ ను మార్చుకోవడం ద్వారా రూ. 50 వేల వరకు తిరిగి పొందవచ్చు. అయితే అది మీ మొబైల్ కండిషన్ అండ్ వర్కింగ్ ని బట్టి రేటును నిర్ణయిస్తారు. ఒకవేళ ఈ మొత్తాన్ని మీరు ఆఫర్ ద్వారా పొందితే.. ఐఫోన్ 14 ధర రూ. 13,499 కి చేరుతుంది. ఈ క్రమంలో యాపిల్ ఐఫోన్ 14ను మీరు రూ. 15 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Also Read: Xiaomi S3 Watch Price: త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో Xiaomi S3 వాచ్‌..లీకైన ఫీచర్స్‌ ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News