Aadhar card misuse: ఈరోజుల్లో ప్రతి విషయానికి ఆధార్ కార్డుతో ముడిపెడుతున్నారు. స్కూల్ అడ్మిషన్, బ్యాంక్ ఖాతాల నిర్వహణ నుంచి కొత్తగా ఏదైనా సిమ్ కార్డు కొనాలన్నా కానీ, ఆధార్ కార్డ్ తప్పనిసరి అయింది. ఈ అన్ని పనులకు అయా అధికారులకు మన పని జరగాలంటే మన ఆధార్ కార్డు హార్డ్ కాపీలను వారి చేతుల్లో పెట్టక తప్పడం లేదు. అయితే, పొరపాటున మీ ఆధార్ కార్డు తప్పుడు వ్యక్తి చేతిలో పడితే మీ సంగతి ఏంటి? ఏం జరుగుతుంది? మీ ఆధార్ కార్డు ఎవరైనా మిస్ యూజ్ చేశారా? ఎలా తెలుసుకోవాలి. భయపడకండి.. దీనికి ఓ ఆప్షన్ ఉంది. మీ ఆధార్ కార్డును మీరు గత ఆరునెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
ఒకవేళ మీ ఆధార్‌కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారని మీకు సందేహం వస్తే మీరు ఆధార్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. తద్వారా గత ఆరు నెలలుగా మీ ఆధార్ ను ఏవిధంగా వినియోగించారో హిస్టరీ తెలిసిపోతుంది. కానీ, దీనికి నామమత్రపు ఫీజును ఆధార్ అధికారిక ప్రతినిధులు వసూలు చేస్తారు.
ఇలా తెలుసుకోండి..
మీ ఆధార్ కార్డు గత ఆరు నెలల హిస్టరీ తెలుసుకోవడానికి ముందుగా Uidai.gov.in/ అధికారికి వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి.
అక్కడ మీకు ఆధార్ అథెండికేషన్ హిస్టరీ ఆధార్ సర్వీసెస్ కింద వైపు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి అప్పుడు ఓ ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా నమోదు చేయండి.
ఓటీపీ మీ ఆధార్ కార్డు లింకు ఉన్న రిజిస్టర్ మొబైల్ నంబర్ కు వస్తుంది (RMN) ఓటీపీని ఎంటర్ చేయండిజ
ఇప్పుడు ఇందులో మీరు వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అథెంటికేషన్ టైప్, డేట్ రేంజ్ ఓటీపీ.
ఓటీపీ వెరిఫికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ ముందుకు గత ఆరు నెలలుగా మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వినియోగించారో దాని వివరాలు వస్తాయి.
ఇదీ చదవండి:ఏప్రిల్ నెలలో దుమ్ము రేపిన టాటా పంచ్, టాప్ 10 జాబితాలో అన్నీ మారుతి కార్లే
ఒక వేళ మీ ఆధార్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారని తెలిస్తే మీరు వెంటనే కంప్లైంట్ చేయాలసి ఉంటుంది 1947 ఆధార్ టోల్ ఫ్రీ నంబర్‌కు వెంటనే కాల్ చేయవచ్ఉ. లేదా help@uidai.gov.in ఎస్‌ఎంఎస్ ద్వారా లేదా https://resident.uidai.gov.in/file-complaint లింక్ పై క్లిక్ చేసి కంప్లంయిట్ పెట్టవచ్చు.
అయితే, మీ కుటుంబ సభ్యుల్లో ఏ వ్యక్తి చనిపోయిన సదరు వ్యక్తి ఆధార్ కార్డు కూడా దుర్వినియోగం చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యలదే. కానీ, చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డును క్యాన్సల్ చేసే సదుపాయం మాత్రం లేదు. చనిపోయిన వ్యక్తి ఏదైనా ప్రభుత్వ లబ్ది ఆ ఆధార్ కార్డు ద్వారా పొందిన వెంటనే సదరు అధికారులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడు సంబంధిత అధికారులు వారి పేరును లబ్ది నుంచి తీసివేస్తారు.
ఇదీ చదవండి:గంటకు 154 కిలోమీటర్ల వేగంతో కొత్త పల్సార్ బైక్, ధర ఫీచర్లు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి