Electric Car: హర్షద్ మెహతాను ఆకర్షించిన లెక్సస్ కారు, 2025 లోగా ఎలక్ట్రిక్ కారుకు సన్నాహాలు

Electric Car: జపాన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ లెక్సస్ గురించి తెలిసిందే. ఇప్పుడీ కంపెనీ ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలో దిగుతోంది. అటు ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 23, 2023, 07:20 PM IST
Electric Car: హర్షద్ మెహతాను ఆకర్షించిన లెక్సస్ కారు,  2025 లోగా ఎలక్ట్రిక్ కారుకు సన్నాహాలు

Electric Car: లెక్సస్ అంటే ఒకప్పుటి లగ్జరీ కార్ల కంపెనీ. జపాన్‌కు చెందిన ఈ కంపెనీ కారు ఇండియాలో సెకండా్ హ్యాండ్ కార్ల వ్యాపారం ప్రారంభించనుంది. వచ్చే ఏడాది ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు మొదలుపెట్టనుంది. ఇండియన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చి ఆరేళ్లు పూర్తయింది. 

లెక్సక్ కంపెనీ ఇండియాలో 23 కేంద్రాల ద్వారా కార్ల అమ్మకాలు కొనసాగిస్తోంది. ఇండియాలో లెక్సస్ కంపెనీ ప్రవేశించి 6 ఏళ్లు పూర్తయింది. కంపెనీకు చెందిన కొన్ని అవుట్ లెట్స్‌లో మార్పులు చేసి సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించేందుకు సిద్ధమౌతోంది. లెక్సస్ అంచే సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ కార్లకు పెట్టింది పేరు. మరోవైపు లెక్సస్ కంపెనీ 2025 వరకూ ఇండియాలో తన తొలి ఎలక్ట్రిక్ కారు ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. 

లెక్సస్ కంపెనీ పాత కార్ల అమ్మకాలపై దృష్టి సారించిందని. దేశంలో కొన్ని ఎంపిక చేసిన అవుట్ లెట్లలో డీలర్‌షిప్ ద్వారా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు సాగించాలనేది కంపెనీ ఆలోచనగా ఉంది. ఈ ఏడాది మూడవ త్రైమాసికం లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు ప్రారంభించవచ్చు. తమ పాత కార్లను అమ్మి కొత్త కార్లను విక్రయించాలనుకునే కస్టమర్ల కోసం ప్రారంభించనుంది.

గత ఏడాది ప్రవేశపెట్టిన కొన్ని కార్లకు జల వాయు పరీక్షలు నిర్వహించామని, కస్టమర్ల ఆలోచన, ఉద్దేశ్యం తెలుసుకునే ప్రయత్నం చేశామని లెక్సస్ కంపెనీ తెలిపింది. 2025 వరకూ ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టనున్నామని లెక్సస్ కంపెనీ వెల్లడించింది. జపాన్‌కు చెందిన టోయోటా లగ్జరీ కార్లు తయారు చేసే కంపెనీ లెక్సస్. 2035 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కారుగా మారాలన్నదే లెక్సస్ కంపెనీ ఆలోచనగా ఉంది. 

1980-90 దశకంలో స్టాక్ మార్కెట్ రారాజుగా వెలిగిన హర్షద్ మెహతా గురించి అందరికీ తెలిసిందే. 4000 కోట్ల కుంభకోణం 1992లో బహిర్గతమైంది. ఆ సమయంలో ఎక్కడ చూసినా హర్షద్ మెహతా పేరు విన్పించేది. లెక్సస్ బ్రాండ్ కార్లంటే హర్షద్ మెహతాకు చాలా క్రేజ్. లెక్సస్ కార్లతో హర్దద్ మెహతా ఫోటోలు అప్పట్లో చాలా వైరల్ అయ్యేవి. అంతటి లగ్జరీ కారు అది. 

Also read: Twitter New Logo: ట్విట్టర్ పిట్టకు బై.. బై.. కొత్త లోగోను ప్రకటించిన మస్క్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News