LIC Plans: ప్రీమియం ఒక్కసారి చెల్లించి..నెలనెలా 20 వేలు పెన్షన్ తీసుకునే ఎల్ఐసీ పాలసీ

LIC Plans: కొత్త ఏడాదిలో పెట్డుబడి పెట్టేందుకు ఆలోచిస్తుంటే ఇదే మంచి అవకాశం. ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసుకుంటే మంచిది. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా 20 వేల రూపాయలు అందుకోవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2023, 05:59 PM IST
LIC Plans: ప్రీమియం ఒక్కసారి చెల్లించి..నెలనెలా 20 వేలు పెన్షన్ తీసుకునే ఎల్ఐసీ పాలసీ

ఇటీవలి కాలంలో ఇన్సూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్‌లో కూడా చాలా కంపెనీలున్నాయి. అద్బుతమైన రిటర్న్స్ అందించే పాలసీలు ఎంచుకోవల్సి ఉంటుంది. ప్రతి నెలా పెన్షన్ ఇచ్చే ప్లాన్స్ ఉంటే ఇంకా మంచిది. 

మీరు కూడా నెల నెలా పెన్షన్ వచ్చే పాలసీ ఎంచుకోవాలనుకుంటే ఎల్ఐసీలో జీవన్ అక్షయ్ ప్లాన్ ఉంది. ఈ పాలసీ తీసుకుంటే నెలకు 20 వేల రూపాయలు అందుకోవచ్చు. పెట్టుబడి పెట్టేందుకు ఎల్ఐసీ చాలా మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ కంపెనీ. ఎల్ఐసీ అందించే జీవన్ అక్షయ్ పాలసీలో కేవలం ఒకసారే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రతి నెలా పెన్షన్ గ్యారంటీగా వస్తుంది. 

ఈ పాలసీ తీసుకునే వ్యక్తి వయస్సు 75 ఏళ్లైతే ఒకేసారి 40 లక్షల 72 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రతి నెలా 20 వేల రూపాయల పెన్షన్ రూపంలో అందుతుంది. ఒకవేళ 6 లక్షల 10 వేల 800 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే..6 లక్షల రూపాయలు లభిస్తాయి. నెలకైతే 6 వేల రూపాయలు లభిస్తాయి. అంటే ఆరు నెలలకు 37 వేల రూపాయలవుతుంది. ఎల్ఐసీ జీవన్ అక్షయ్ ప్లాన్‌లో కనీసం ఏడాదికి 12 వేల రూపాయలు పెన్షన్ లభిస్తుంది. మరణించేవరకూ ఇది అందుతుంది.

ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి. ఎప్పుడైనా హఠాత్తుగా రుణం అవసరమైతే..ఈ ప్లాన్ తీసుకున్న 90 రోజుల తరవాత లోన్ తీసుకోవచ్చు. ఈ పాలసీలో ఎంత కావలిస్తే అంత పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు గరిష్ట పరిమితి లేదు. కనీసం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 

Also read: Multibagger stocks: పదేళ్లలో 1 లక్ష రూపాయలు 35 కోట్లుగా మారడం ఎప్పుడైనా విన్నారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News