Top 7 Seater Cars: తక్కువ ధరలో టాప్ 7 సీటర్ కార్లు, వాటి ధర, మైలేజ్ వివరాలు

Top 7 Seater Cars: దేశంలో గత కొద్దికాలంగా 7 సీటర్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండే ఇదే బెస్ట్ ఆప్షన్. వీటిలో టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ 7 సీటర్ కార్లు ఏమున్నాయో ఓసారి పరిశీలిద్దాం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 6, 2024, 07:11 AM IST
Top 7 Seater Cars: తక్కువ ధరలో టాప్ 7 సీటర్ కార్లు, వాటి ధర, మైలేజ్ వివరాలు

Top 7 Seater Cars: గత కొద్దికాలంగా సెడాన్ కార్ల స్థానంలో ఎస్‌యూవీ, 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. డ్రైవింగ్ కంఫోర్ట్, ఎక్కువమంది ప్రయాణించే వీలుండటం వంటి కారణాలతో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్ లో 7 సీటర్ కార్లు చాలానే ఉన్నాయి. అయితే అనుకూలమైన ధరలో అందుబాటులో ఉన్న టాప్ 5 సెవెన్ సీటర్ల కార్ల గురించి తెలుసుకుందాం.

పెద్ద కుటుంబాలకు 7 సీటర్ కార్లు బెస్ట్ ఆప్షన్, లాంగ్ జర్మీ కోసం కూడా ఇవే బెస్ట్ అని చెప్పవచ్చు. డ్రైవింగ్ కంఫోర్ట్ ఉంటుంది. పెద్దగా అలసిపోయే పరిస్థితి ఉండదు. మార్కెట్‌లో 7 సీటర్ కార్లు చాలా ఉన్నాయి. అందులో ఏవి మంచివి, ఏ కార్లు బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటాయనే వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా మార్కెట్‌లో ఉన్న టాప్ 5 సెవెన్ సీటర్ కార్ల వివరాలు ఇలా ఉన్నాయి.

1.  టొయోటా రుమియన్ ఇంటీరియర్ చాలా బాగుంటుంది. కారు డిజైన్ కూడా బాగుండటమే కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ కారు ఇది. రోజూ వినియోగించాలన్నా బెస్ట్ ఆప్షన్, డ్రైవింగ్ కంఫోర్ట్‌తో పాటు సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఎక్కువే. ఈ కారు ధర 10.29 లక్షల్నించి ప్రారంభమౌతుంది. 

2. మారుతి సుజుకి ఎర్టిగా. దేశంలో అందుబాటులో ఉన్న 7 సీటర్ కార్లలో అత్యంత ఆదరణ పొందుతున్న కారు ఇది. ఈ కారు తక్కువ ధరకు లభిస్తుండటమే కాకుండా మంచి మైలేజ్ ఇస్తుంది. డ్రైవింగ్ కంఫోర్ట్ చాలా బాగుంటుంది. ఎర్టిగాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 105 బీహెచ్‌పి పవర్, 138 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు 24.52 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఎర్టిగా ధర 8.64 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. 

3. మహీంద్రా స్కోర్పియో ఎన్. ఇదొక బెస్త్ 7 సీటర్ ఎస్‌యూవీ. చాలామంది ఈ కారును ఇష్టపడుతున్నారు. స్కార్పియో నియో వేరియంట్‌లో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 138 బీహేచ్‌పి పవర్, 300 ఎన్‌ఎం టార్గ్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ కారు మైల్జ్ 14.5 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ కారు ధర 13,26 లక్షల్నించి ప్రారంభమౌతుంది. 

4. రీనాల్ట్ ట్రైబర్. 7 సీటర్ల కార్లతో మారుతి ఎర్టిగాకు పోటీ ఇస్తోంది. ఈ కారు అద్భుతమైన స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లు కలిగి ఉంటుంది. డ్రైవింగ్ కంఫోర్ట్ కూడా బాగుంటుంది. ధర చాలా తక్కువ. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 72 బీహెచ్‌పి పవర్, 96 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు 18.1 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధర 6.33 లక్షలతో ప్రారంభమౌతుంది. 

5. మహీంద్రా బొలేరో నియో. వాస్తవానికి ఇదొక ఎస్‌యూవీ. ఇందులో 7 సీటర్ కూడా ఉంది. ఈ కారు స్ట్రాంగ్ బాడీ కలిగి ఉండటం వల్ల సెక్యూరిటీ ఉంటుంది. బొలేరో నియోలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 100 బీహెచ్‌పి పవర్, 260 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ కారు మైలేజ్ కూడా ఎక్కువే. లీటర్‌కు 17.4 కిలోమీటర్లు ఇస్తుంది. బొలేరో నియో ధర 9.64 లక్షల్నించి ప్రారంభం కానుంది. 

Also read: Recruitment Growth 2024: న్యూ ఇయర్‌లో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ ఏడాది భారీగా నియామకాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News