MARA RAJA BATTERIES భారీ పెట్టుబడులకు అమర్ రాజా బ్యాటరీస్ సిద్ధం అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ భారీ పెట్టుబడులకు సిద్ధం అవుతోంది. అమరరాజా బ్యాటరీస్ ఏకంగా రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. బ్యాటరీ రంగంలో చాలా కాలంగా విస్తృత సేవలు అందిస్తున్న సంస్థ ఈసారి ద్విచక్ర, కార్ల బ్యాటరీల సామర్థ్యాలను పెంచుకునేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకు అవసరం అయిన ఏర్పాట్లను చేస్తోంది. సామర్థ్యాల విస్తరణ, లిథియం అయాన్ సెల్ యూనిట్‌లతో పాటు బ్యాటరీల రీసైక్లింగ్ ప్లాంట్ పై ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ వెల్లడించింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దాదాపు రూ.760 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈసారి మరోసారి ఏకంగా ఏడు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుసు సిద్ధం అవుతోంది. ఇందుకోసం ఏర్పాటు చేస్తున్న బ్యాటరీల రీసైక్లింగ్ ప్లాంట్ రానున్న 18-20 నెలల్లో పూర్తి అవుతుందని ప్రకటించింది.
ద్విచక్ర, కార్ల బ్యాటరీల విస్తరణ సామర్థ్యాలు ఈ మరికొన్ని నెలల్లోనే అందుబాటులోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. అయితే లిథియం అయాన్ సెల్ ప్లాంట్ కు మాత్రం మరో రెండేళ్ల సమయం పడుతుందని ప్రకటించింది. రానున్న ఐదు సంవత్సరాల్లో సంయుక్త సంస్థల ఏర్పాటుతో పాటు కొత్త భాగస్వామ్యాల ద్వారా ప్రతీ సంవత్సరం ఆదాయంలో 15-17 శాతం వృద్ధి నమోదు చేయాలని సంస్థ భావిస్తోంది.
మారుతున్న కాలమాన పరిస్థితుల నేపథ్యంలో అన్ని విభాగాల్లో బ్యాటరీలకు బాగా డిమాండ్ ఏర్పిడిందని సంస్థ తెలిపింది. అయితే ముడి పదార్థాల ఖర్చులు బాగా పెరిగిపోవడంతో వినియోగదారులకు చవకైన ధరలకు అందించడం కష్టంగా మారిందని తెలిపింది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమయం పడుతోందని వెల్లడించింది. అమరరాజా బ్యాటరీస్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 35 దేశాల్లో బ్యాటరీల సేల్స్ చేస్తోంది. ఇక సంస్థకు అందుకున్న ఆదాయంలో 12 శాతం ఎగుమతుల ద్వారానే లభిస్తోంది. కొత్త సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా విదేశీ మార్కెట్లలో విస్తరించాలని భావిస్తోంది. అయితే ఇందుకు అవసరమైన పెట్టుబడి కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడించింది.
also iPhone 12 Mini Flipkart: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.20 వేలకే iPhone 12 Mini!
also New Rules in June: పౌరులారా తస్మాత్ జాగ్రత్త.. జూన్ లో అమలు కానున్న కొత్త రూల్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook