Maruti Suzuki Swift 2024: కొత్త మారుతి స్విఫ్ట్ 2024పై స్పష్టత, డిజైన్, పీచర్లు ఎలా ఉంటాయంటే

Maruti Suzuki Swift 2024: దేశంలో అత్యంత నమ్మకమైన కార్లలో ఒకటి. దశాబ్దాలుగా భారతీయుల మనసు చూరగొన్నది మారుతి. అందుకే మారుతి కంపెనీ ఎన్ని మోడల్స్ మార్కెట్‌లో ప్రవేశపెట్టినా అన్నీ టాప్ సేల్స్ సాధిస్తుంటాయి. త్వరలో మారుతి స్విఫ్ట్ కొత్త వెర్షన్ లాంచ్ చేయనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 29, 2023, 11:06 AM IST
Maruti Suzuki Swift 2024: కొత్త మారుతి స్విఫ్ట్ 2024పై స్పష్టత, డిజైన్, పీచర్లు ఎలా ఉంటాయంటే

Maruti Suzuki Swift 2024: జపాన్‌కు చెందిన సుజుకి కంపెనీ కొలాబొరేషన్‌తో మారుతి సుజుకి పేరుతో కార్లు తయారు చేస్తున్న ఈ కంపెనీ ఇటీవలే టోక్యోలో జరిగిన మొబిలిటీ షోలో స్విఫ్ట్ కాన్సెప్ట్ ప్రదర్శించింది. భారత స్పేక్ మోడల్ టెస్టింగ్ సందర్బంగా ఈ కారు చాలా సార్లు కన్పించింది. అసలీ కారు ఎలా ఉంటుందనేది పూర్తిగా ఎవరికీ తెలియకపోయినా అంచనాలు మాత్రమే చాలానే ఉన్నాయి. 

మారుతి స్విఫ్ట్ కాన్సెప్ట్ ఈ కారు కోర్ డీఎన్ఏ చూపించింది. ఫ్రంట్ గ్రిల్‌లో హనీకోంబ్ డిజైన్ ఉంది. హెడ్ లైట్స్ , ఎల్ఈడీ డీఆర్ఎల్ రెండూ షార్ప్‌గా ఉన్నాయి. సైడ్ నుంచైతే స్విఫ్ట్ కాన్సెప్ట్ పాత స్విఫ్ట్‌లానే అన్పించింది. రేర్ డోర్ హ్యాండిల్ ఇప్పుడు ట్రెడిషనల్ పొజిషన్‌లో ఉంటుంది. గత మోడల్‌లో సీ పిల్లర్ లోపల్నించి ఉంది. స్విఫ్ట్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. బంపర్ మెరుస్తోంది. కానీ పూర్తిగా కవర్ అయి ఉన్నందున స్పష్టత లేదు. 2024 స్విఫ్ట్ కారు 3,860 మిల్లీమీటర్ల పొడవు, 1695 మిల్లీమీటర్ల వెడల్పు, 1500 మిల్లీమీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. గత స్విఫ్ట్‌తో పోలిస్తే 15 మిల్లీ మీటర్లు పొడవు, 40 మిల్లీమీటర్లు వెడల్పు, 30 మిల్లీమీటర్లు ఎత్తు తక్కువ ఉంటుంది. వీల్ బ్యాలెన్స్ 2,540 మిల్లీమీటర్లు ఉండవచ్చు. అయితే ఇది ఇంటర్నేషనల్ మోడల్ మాత్రమే. ఇండియాలో లాంచ్ అయ్యో మోడల్ కాస్త వేరుగా ఉండవచ్చు.

ఇటీవల టోక్యోలో జరిగిన మొబిలిటీ షోలో మారుతి సుజుకి కొత్త 1.2 లీటర్ త్రీ సిలెండర్ డిజైన్ కన్పించింది. భవిష్యత్తులో 1.2 లీటర్ 4 సిలెండర్‌గా మారనుంది. మారుతి సుజుకి ఇప్పటి వరకూ కొత్త ఇంజన్ ఫీచర్లు ఎలా ఉంటాయో బహిర్గతం చేయలేదు. టోక్యో షోలో కొత్త 1.2 లీటర్ ఇంజన్ హైబ్రిడ్ వెర్షన్, కొత్త సీవీటీ ట్రాన్స్‌మిషన్ చూపించింది. 

Also read: Kia Seltos Price Cut: సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై ధర తగ్గించిన కియా, ఇప్పుడెంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News