ఇంటి కొనుగోలుకు రుణం తీసుకోవాలనుకుంటున్నారా..అయితే మీకు గుడ్‌న్యూస్. పండుగ సీజన్ పురస్కరించుకుని ఎస్బీఐ హోమ్ లోన్స్‌పై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి పూర్తి వివరాలున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను అక్టోబర్ 4 నుంచే ప్రారంభించింది. 2023 జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.
హోమ్ లోన్ వడ్డీ తగ్గింపు
ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు 8.55 శాతం నుంచి 9.05 శాతం ఉంది. అయితే ఫెస్టివ్ క్యాంపెయిన్ ఆఫర్‌లో భాగంగా వడ్డీ రేటును 0.15 నుంచి 0.30 వరకూ తగ్గించింది. అంటే కస్టమర్లకు ఇప్పుడు 8.40 నుంచి 9.05 శాతం వరకూ వడ్డీ వర్తిస్తుంది. బ్యాంక్ రుణాలపై ఎంత వడ్డీ వర్తిస్తుందనేది మీ సిబిల్ స్కోర్ ఆధారంగా ఉంటుంది. ఎస్బీఐ ఈ డిస్కౌంట్ ఆఫర్‌పై ఇదే నియమాన్ని అమలు చేస్తోంది. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే..అంత తక్కువ వడ్డీ ఉంటుంది.
సిబిల్ స్కోర్ ఆధారంగా డిస్కౌంట్
ఎస్బీఐ ప్రకారం కస్టమర్ల సిబిల్ స్కోర్ 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే..8.40 వడ్డీతో రుణం లభిస్తుంది. 8.55 సాధారణ వడ్డీతో పోలిస్తే ఇది 0.15 శాతం తక్కువ. ఇక సిబిల్ స్కోర్ 750 నుంచి 799 ఉంటే 0.25 శాతం లాభం కలుగుతుంది. అంటే సాధారణ వడ్డీ 8.65 శాతం నుంచి 8.40 శాతానికి చేరుతుంది. సిబిల్ స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉంటే..0.20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వడ్డీ 8.75 శాతం నుంచి 8.55 శాతానికి తగ్గుతుంది. ఇక సిబిల్ స్కోర్ 700 కంటే తక్కువ ఉంటే..ఏ విధమైన డిస్కౌంట్ వర్తించదు.
మరోవైపు టాప్ అప్ హోమ్ లోన్స్, ప్రోపర్టీ హోమ్ లోన్ వడ్డీ రేట్లను కూడా ఎస్బీఐ తగ్గించింది. టాప్ అప్ హోమ్ లోన్స్‌పై 15 బేసిస్ పాయింట్లు, ప్రోపర్టీ హోమ్ లోన్స్‌పై 30 బేసిస్ పాయింట్లు మినహాయింపు ఇచ్చింది. ఫెస్టివ్ క్యాంపెయిన్ సందర్భంగా టాప్ అప్ లోన్స్‌పై ఎస్బీఐ జీరో ప్రోసెసింగ్ ఫీజు కూడా అందిస్తోంది. ప్రోపర్టీ హోమ్ లోన్స్‌పై మాత్రం ఎస్బీఐ ప్రోసెసింగ్ ఫీజు 10 వేలు వసూలు చేస్తుంది.
Also read: TCS Share Results: టీసీఎస్ షేర్ హోల్డర్లకు గుడ్‌న్యూస్, డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
SBI Home Loans: ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లపై డిస్కౌంట్ ఆఫర్స్, జనవరి వరకే అవకాశం