Multibagger Share: ఆ కంపెనీ షేర్ ఊహించని లాభాలు, 6 నెలల్లో 4 రెట్లు వృద్ధి, బోనస్ షేర్లు, ఇన్వెస్టర్లకే పండగే

Multibagger Share: షేర్ మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు షేర్లు ఉంటాయి. కొన్ని లాభాలు కురిపిస్తుంటాయి. కొన్ని నష్టాల్ని తెస్తుంటాయి. అదే విధంగా కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడిని 6 నెలల్లో నాలుగింతలు చేశాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 13, 2022, 05:00 PM IST
Multibagger Share: ఆ కంపెనీ షేర్ ఊహించని లాభాలు, 6 నెలల్లో 4 రెట్లు వృద్ధి, బోనస్ షేర్లు, ఇన్వెస్టర్లకే పండగే

షేర్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి నిశితంగా పరిశీలిస్తుండాలి. ఇన్వెస్టర్లకు అద్బుతమైన లాభాల్ని తెచ్చిపెట్టేవి ఈ షేర్లే. కొన్ని స్వల్పకాలంలో ఊహించని లాభాల్ని ఆర్జిస్తే మరికొన్ని దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడిపై వేలాది రెట్లు రిటర్న్స్ అందిస్తుంటాయి. 

గ్రేటెక్స్ కార్పొరేట్ సర్వీసెస్ అనేది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఇది బీఎస్ఈలో మాత్రమే ఎం శ్రేణిలో లిస్ట్ అయింది. గ్రేటెక్స్ వరుసగా 7వ రోజు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌పై బ్రేక్ టు బ్రేక్ చేసింది. 

అక్టోబర్ తొలివారంలో కనీసం 21.5 శాతం వృద్ధి నమోదైంది. బీఎస్ఈ ఎస్ఎంఈలో ప్రవేశించిన రెండేళ్ల కాలంలో గ్రేటెక్స్ మల్టీబ్యాగర్ స్టాక్‌గా ఎదిగింది. అంతేకాకుండా 6 నెలల్లో గ్రేటెక్స్ 1 లక్ష రూపాయల పెట్టుబడిని 3 లక్షలుగా చేసింది. ప్రస్తుతం స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకుంది. త్వరలకో ఇన్వెస్టర్లకు 8:1 బోనస్ షేర్లు అందించనుంది. బీఎస్ఈపై గ్రేటెక్స్ షేర్ 30.05 రూపాయలు లేదా  4.99 శాతం వృద్ధితో 631.70 వద్ద క్లోజ్ అయింది. కంపెనీ మార్కెట్ క్యాప్‌లో దాదాపు 71.85 కోట్లున్నాయి.

గ్రేటెక్స్ జూలై 27వ తేదీ, 2021లో బీఎస్ఈలో ప్రారంభమంది. అప్పుడీ స్టాక్ విలువ 176 రూపాయలుంది. అయితే ఏడాదిలో గ్రేటెక్స్ షేర్ మార్చ్ 29 నాటికి 160 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తరవాత మళ్లీ షేర్ వేగం పుంజుకుని..295 శాతం పెరుగుదల నమోదు చేసింది. మార్చ్ 29 నుంచి అక్టోబర్ 7 2022 వరకూ గ్రేటెక్స్ షేర్లు ఇన్వెస్టర్ల పెట్టుబడిని దాదాపు 3.95 రెట్లు పెంచేశాయి.

గ్రేటెక్స్ లక్ష్యం 2030 వరకూ ఐపీవో, ఎం అండ్ ఏ, పీఈ వంటి సేవలకై ఇండియాలో నెంబర్ 1 మెర్చెంట్ బ్యాంక్‌గా వృద్ధి చెందాలి. అక్టోబర్ 4వ తేదీన గ్రేటెక్స్ కంపెనీ 8:1 బోనస్ షేర్లను ఇవ్వాలని నిర్ణయించింది. బోనస్ ఇష్యూలో భాగంగా కంపెనీ 90,98,760 ఈక్విటీ షేర్లను జదారీ చేయనుంది. వీటి విలువ పది రూపాయల చొప్పున 9.10 కోట్లవుతుంది. బోనస్ నిష్పత్తి 8:1గా ఉంది. అంటే కంపెనీ షేర్ హోల్డర్లకు 1 షేర్‌కు 8 ఈక్విటీ షేర్లు ఇస్తుంది.

Also read: Hot Stocks: 15 రోజుల్లో లాభాలు కురిపించనున్న మూడు కంపెనీల షేర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News