ట్విట్టర్‌ లో పని చేసేందుకు పలువురి ఆసక్తి ...ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన

ట్విట్టర్‌లో ఉద్యోగాలు కావాలంటూ నేరుగా టీట్టర్‌లోనే ట్వీట్ చేస్తూన్నారు. కొంత మంది మెయిల్ ఐడీకి తమ రెస్యూమ్‌లు కూడా పంపేస్తున్నారు. వీరిలో ఎంఐటీ సైంటిస్ట్ నుండి ‘స్టార్ ట్రెక్’ స్టార్ విలియం షాట్నర్ నుంచి వరకు ఉన్నారు. ‘హైర్ మీ, మస్క్!’  ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది.   

Last Updated : May 3, 2022, 02:21 PM IST
  • ట్విటర్‌లో చీఫ్ లవ్ ఆఫీసర్(సీఎల్ఓ) పోస్టుకు తెగ క్రేజ్
  • జీతం క్రిప్టో కరెన్సీలో చెల్లించాలని వినతి
  • వాక్ స్వాతంత్రానికి ప్రతీకగా మారిన ట్విట్టర్‌
 ట్విట్టర్‌ లో పని చేసేందుకు పలువురి ఆసక్తి ...ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన

Twitter Pitch Featured Job Cuts ఏకంగా 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ ‌మస్క్... ఇప్పుడు ట్విట్టర్‌లో సమూల మార్పులకు సిద్ధపడుతున్నాడు. పాత వాళ్లను సాగనంపి కొత్త వాళ్లతో ట్విట్టర్ నడపాలని భావిస్తున్నారు. మరో వైపు మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు ట్వీట్టర్‌లో పని చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ట్విట్టర్‌లో ఉద్యోగాలు కావాలంటూ నేరుగా టీట్టర్‌లోనే ట్వీట్ చేస్తూన్నారు. కొంత మంది మెయిల్ ఐడీకి తమ రెస్యూమ్‌లు కూడా పంపేస్తున్నారు. వీరిలో ఎంఐటీ సైంటిస్ట్ నుండి ‘స్టార్ ట్రెక్’ స్టార్ విలియం షాట్నర్ నుంచి వరకు ఉన్నారు. ‘హైర్ మీ, మస్క్!’  ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. 

అయితే ముఖ్యంగా ట్విటర్‌లో చీఫ్ లవ్ ఆఫీసర్(సీఎల్ఓ) పోస్టుకు తెగ క్రేజ్ నెలకొంది. ప్రపంచంలో ప్రేమను పెంచేందుకు ప్రయత్నిస్తామంటూ పలువురు ఈ జాబ్‌ పై ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీల నుంచి సైంటిస్ట్‌ల వరకు ఈ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. జీతం క్రిప్టో కరెన్సీలో చెల్లిస్తే చాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమను పెంచేందుకు తమ వంతు సాయం చేస్తామని అంటున్నారు. వాక్ స్వాతంత్రానికి ప్రతీకగా మారిన ట్విట్టర్‌లో పనిచేయడం అంటే ఎంతో గొప్పగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. దీంతో ట్విట్టర్‌లో ఉద్యోగాల కోసం డిమాండ్ పెరిగిపోయింది. మరోవైపు ఈ ట్విట్టర్‌ ప్లాట్‌ఫామ్‌ను మరింత చక్కగా రూపుదిద్దేందుకే  మస్క్ పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ అమలులోకి వస్తే ట్విట్టర్‌ మరింత యూజర్ ఫ్రెండ్లీ కానుంది. 

మార్కెట్ ధర కంటే భారీ మొత్తాన్ని ఇచ్చి ట్విట్టర్ కొనుగోలు చేసిన మస్క్‌... ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చే ఆదాయం ఎంత అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. మస్క్ ట్విట్టర్ మీద పెట్టుబడి పెట్టిన స్థాయిలో లాభాలు ఆర్జించడం సాధ్యం కాదని ఫైనాన్స్‌ సిబ్బంది తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాల్లో కొత పెట్టాల్సిందే అని సూచిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకుంటే కాని పెట్టుబడికి తగిన  రాబడి రాబట్టలేమని సూచిస్తున్నారు. దీంతో ఈ ప్రతిపాదనలపై మస్క్ తీవ్రంగా మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఫైనాన్స్‌ విభాగం చెప్పినట్లు వినడమా లేకపోతే మార్కెట్‌లో ట్వీట్టర్‌కు ఉన్న క్రేజ్ కు అనుగుణంగా మరిన్ని డబ్బులు పెట్టడమా అనేది తేల్చుకోలేకపోతున్నారు. 

మరోవైపు ట్విట్టర్‌లో ఇంత కాలం పని చేసిన సిబ్బంది...సేఫ్టీ కోసం వేరే ఉద్యోగాలు చూసుకుంటున్నట్లు సమాచారం. ఇంత కాలం పెట్బుబడికి తగ్గ ఆదాయంతో సాఫీగా సాగిన పయనంలో ఇప్పుడు మస్క్‌ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. జీతాల్లో కోత పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా చాలా మంది ఫ్రెషర్స్ మాత్రం తక్కువ జీతాలకే ట్వీట్టర్‌లో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

also read Sony BRAVIA X75K 4K TV: సోని నుంచి అదిరిపోయే టీవీ, ఫీచర్లను చూసి ఫిదా అవ్వాల్సిందే.!

also read Whatsapp: భారతీయ యూజర్లకు వాట్సప్ షాక్, 18 లక్షల ఖాతాలు బ్యాన్, కారణమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News