New Rules in July: జూలై నెలలో మీపై ప్రభావం చూపే కొత్త రూల్స్‌ ఇవే.. ఈ సారైనా వాటి ధరలు తగ్గుతాయా?

New Rules in July 2023: ప్రతి నెలలో రూల్స్‌ చేంజ్‌ అవుతాయి. అయితే వీటి మార్పుల కారణంగా అందరిపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా వస్తువు విక్రయాల ధరల్లో కూడా తీవ్ర మార్పులు వస్తాయి. అయితే ఈ నెల ఎలాంటి చేంజింగ్‌ జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 30, 2023, 10:49 AM IST
New Rules in July: జూలై నెలలో మీపై ప్రభావం చూపే కొత్త రూల్స్‌ ఇవే.. ఈ సారైనా వాటి ధరలు తగ్గుతాయా?

Rules Changes From 1st July 2023: నెల మారిందటే చాలు కొత్త రూల్స్‌లో భారీ మార్పులు వస్తాయి. అయితే వీటిని వల్ల మనపై ప్రత్యేక్షంగానో..పరోక్షంగానో ప్రభావం పడుతుంది. కొత్త రూల్స్‌ అమలులోకి వస్తే కొన్ని రకాల వస్తువుల ధరల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో కానీ, ఆధార్‌కు పాన్‌ కార్డుల లింకింగ్‌ ప్రక్రియలో కూడా మార్పులు వస్తాయి. అయితే ఈ నెలలో అమలులోకి వచ్చిన రూల్స్‌ ఏమిటో వీటినికి సంబంధించిన నియమనిబంధనలు మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ నెలలో వచ్చిన కొత్త రూల్స్‌ నియమనిబంధనలు తెలుసుకోండి:
EPF ఖాతాదారులకు కొత్త ఆప్షన్‌ రాబోతోందని తెలుస్తోంది. తర్వలోనే పెన్షన్‌ సంబంధించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో కూడా మార్పులు రాబోతోంది. ఇప్పటికి EPFO ఎంచుకోవడానికి పలు రకాల మార్పులు ప్రవేశపెట్టిన కేంద్రం ఇటీవలే చివరి తేదిని పొడగించబోతున్నట్లు సమాచారం.  హయ్యర్ పెన్షన్ ఆప్షన్ జూలై 12 వరకు చూస్‌ చేసుకునే అవకాశాలున్నాయని అధికారి వెబ్ పోర్టులో పేర్కొన్నారు.

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

ప్రతి సంవత్సరంలో నెలల మొదటి రోజు     LPG గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఆయిల్‌ కంపెనీలు ప్రతి నెల సిలిండర్‌ ధరలు పెంచే ఛాన్స్‌తో పాటు తగ్గించే ఛాన్స్‌ ఉంటుంది. అయితే ఈ జూలై నెల 1వ తేదినా ధరలు స్థిరంగా ఉండే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు.  

ఈ జూలై 1 నుంచి ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయని పాన్‌ కార్డులు పనికి రావట. ఈ లింకింగ్‌ ప్రక్రియ ఈ నెల 30 వరకే చివరి తేది అని కేంద్ర వెల్లడించింది. ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ కార్డులు బ్యాంక్‌ల్లో లావాదేవీలకు చెల్లవు. తరచుగా పాన్‌ కార్డులను వినియోగించేవారు తప్పకుండా ఆధార్‌ లింక్‌ ఈ నెల 30 వరకే చేసుకోవాల్సి ఉంటుంది. 

అమెజాన్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం ప్రైమ్‌ డే సేల్స్‌ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది జూలై 1    5 నుంచి 16లోపు ఈ సేల్స్‌ను నిర్వహించబోతునట్లు ఆమెజాన్‌ ప్రకటించింది. అంతేకాకుండా SBI, ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో వస్తువులను కొనుగోలు చేసేవారికి అదనంగా 1o శాతం డిస్కౌంట్‌ను అందిస్తునట్లు కూడా సమాచారం. 

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News