Phone Pe Offer: ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ ఫోన్ పే యూజర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌తో కలిసి సరికొత్తగా హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తోంది. ప్రైజ్ మనీ ఎంతంటే..
ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. నిజమే..దేనికైనా ఆలోచన ముఖ్యం. ఆలోచన సరైందైతే ఆచరణ ఎలాగైనా చేయవచ్చు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో వినూత్న ఆలోచనలకే అవకాశాలున్నాయి. సరికొత్తగా ఆలోచించగలిగితేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే బంపర్ ఆఫర్ ప్రకటించింది. నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో భారీగా ప్రైజ్‌మనీ ఎనౌన్స్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో మొట్టమొదటి సారిగా ఫోన్ పే, నీతి ఆయోగ్ సంయుక్తంగా హ్యాకథాన్ నిర్వహిస్తున్నాయి. ఫిన్‌టెక్ కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్‌పై దృష్టి సారించనున్నాయి. హ్యాకథాన్ ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్నించి ఆవిష్కర్తలు, డిజిటల్ సృష్టికర్తలు, డెవలపర్‌లకు కొత్తగా ఆలోచించేందుకు, ఆలోచనల్ని అమలు చేసేందుకు, కోడ్ చేసేందుకు ఫోన్ పే అవకాశం కల్పిస్తుంది. ఈ పోటీలో గెలిచినవారికి 5 లక్షల రూపాయల నగదు బహుమతులుంటాయి. ఈ పోటీలో పాల్గొనేవారు ఫోన్ పే పల్స్, ఓపెన్ గవర్నమెంట్ డేటా ప్లాట్‌ఫామ్, ఆర్బీఐ నివేదికల్ని ఉపయోగించుకోవచ్చు.సేతు ఏఏ శాండ్‌బాక్స్‌తో పాటు తెలిసిన అన్ని డేటా ప్లాట్‌ఫామ్స్‌లు వినియోగించుకునే సౌలభ్యముంటుంది. మొదటి
హ్యాకథాన్ పోటీలో ఫస్ట్‌ప్రైజ్ సాధించినవారికి 1.5 లక్షల రూపాయలు,సెకండ్ ప్రైజ్‌కు లక్ష రూపాయలు, థర్డ్‌ప్రైజ్‌కు 75 వేల రూపాయలు నగదు బహుమతి ఉంటుందని ఫోన్ పే తెలిపింది. హ్యాకథాన్ పోటీలో పాల్గొనేందుకు ఫిబ్రవరి 23వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవల్సి ఉంటుంది. తుది ఎంట్రీలు 25 వ తేదీలోగా పంపించాలి. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఫిబ్రవరి 21 సాయంత్రం 4 గంటలకు అవకాశముంటుంది. ఫిబ్రవరి 28న విజేతల్ని ప్రకటిస్తారు. నీతి ఆయోగ్‌తో(Niti Aayog)కలిసి చేపట్టిన పోటీ కావడంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున కంటెస్టెంట్లు రావచ్చని తెలుస్తోంది.
Also read: RBI Jobs: ఆర్బీఐలో భారీగా ఉద్యోగాలు- దరఖాస్తు, పరీక్ష తేదీలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook