SBI Alert: ఎస్​బీఐ ఖాతాదారులకు అలర్ట్​- గడువులోపు అ పనిని పూర్తి చేయకుంటే నిలిచిపోనున్న సేవలు!

ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ యూజర్లకు అలర్ట్​. ఇంకా ఎవరైనా ఖాతాదారులు ఆధార్​తో పాన్ అనుసంధానం చేయకుంటే.. ఆ పనిని వెంటనే పూర్తి చేయాలని అలర్ట్ చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2022, 05:32 PM IST
  • ఖాతాదారులకు ఎస్​బీఐ అలర్ట్​
  • ఆధార్​-పాన్​ లింక్ లేకుంటే సేవలు నిలిచిపోనున్నట్లు ప్రకటన
  • తుది గడువులోపే ప్రక్రియ పూర్తి చేయాలని సూచన
SBI Alert: ఎస్​బీఐ ఖాతాదారులకు అలర్ట్​- గడువులోపు అ పనిని పూర్తి చేయకుంటే నిలిచిపోనున్న సేవలు!

SBI Alert: ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ యూజర్లకు అలర్ట్​. ఇంకా ఎవరైనా ఖాతాదారులు ఆధార్​తో పాన్ అనుసంధానం చేయకుంటే.. ఆ పనిని వెంటనే పూర్తి చేయాలని అలర్ట్ చేసింది.

గడువులోపు ఆధార్​తో పాన్ లింక్ పూర్తవకుంటే.. వినియోగదారులకు బ్యాంకింగ్ సేవల్లో సమస్యలు రావచ్చని తెలిపింది. ఆధార్​-పాన్​ లింక్​కు మార్చి 31 తుది గడువుగా స్పష్టం చేసింది బ్యాంక్​.

నిజానికి గత ఏడాది సెప్టెంబర్​ 30తో ఆధార్​ పాన్​ అనుసంధానానికి గడువు ముగియాల్సి ఉంది. అయితే కరోనా సంక్షోభం వల్ల ఈ గడువును మార్చి 31 వరకు పెంచింది ప్రభుత్వం.

ఆధార్​-పాన్ లింక్​ ఎలా చేయాలి?

  • ముందుగా ఇన్కం ట్యాక్స్​ అధికారిక వెబ్​సైట్లోకి లాగిన్ అవ్వాలి https://www.incometaxindiaefiling.gov.in/home
  • హోం పేజీలో లింక్​ 'Link Aadhaar' ఆప్షన్​పై క్లిక్ చేయాలి.. దీనితో మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • కొత్త పేజీలో మీ పాన్​, ఆధార్​ వివరాలను వాటిల్లో ఉన్నట్లుగా నింపాలి
  • మీ ఆధార్​పై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే.. have only year of birth in aadhaar card ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత క్యాప్చా ఎంటర్​ చేయడం లేదా ఓటీపీ ఆప్షన్​ను ద్వారా వివరాలను వెరిఫై చేయాలి
  • వెరిఫికేషన్ పూర్తయ్యాక.. పాన్-ఆధార్ లింక్ బటన్​పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

ఎస్​ఎంఎస్​ ద్వారా ఎలా చేయాలంటే..

UIDPAN అని టైప్ చేసి స్పేస్​ ఇచ్చి 12 అంకెల ఆధార్ నంబర్​ను ఎంటర్​ చేయాలి మళ్లీ స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ కార్డ్ నంబర్​ను ఎంటర్ చేయాలి.

567678 లేదా 56161 నంబర్​కుపై విధంగా ఎస్​ఎంఎస్ పంపడం ద్వారా కూడా ఆధార్-పాన్​ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

Also read: SBI charges: ఎస్​బీఐ ఐఎంపీఎస్​ లిమిట్​ పెంపు- కొత్త పరిమితి, ఛార్జీలు ఇవే..

Also read: LIC Policy: కోటి రూపాయలు తెచ్చిపెట్టే ఎల్ఐసి పాలసీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News