Nokia 3.4 Price In India And Specifications: నోకియా 3.4 ఈ డిసెంబర్ నెలలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐరోపాలో నోకియా 2.4తో పాటు సెప్టెంబర్‌లో లాంచ్ చేశారు. కొన్ని రోజుల్లో భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. గత నెలలో నోకియా 2.4 మోడల్ లాంచ్ చేసింది. నోకియా 3 సిరీస్‌లో ట్రిపుల్ రియర్ కెమెరాలతో వచ్చిన మొట్టమొదటిది మోడల్ నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్. నోకియా 3.4 నోర్డిక్ కలర్ పాలెట్ (Nokia 3.4 Specifications:)ను కలిగి ఉంటుంది. ఇది మూడు రంగులలో లభించనుంది. నోకియా పవర్ యూజర్ రిపోర్ట్ ప్రకారం.. డిసెంబర్ మధ్యలోనే నోకియా 3.4 లాంచ్ కానుంది. నెలాఖరుకల్లా ప్రీ ఆర్డర్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
Nokia 3.4 price in India (భారత్‌లో నోకియా 3.4 అంచనా ధర)
భారత్‌లో ఈ నెలలో లాంచ్ కానున్న నోకియా 3.4 ధర రూ.11,999గా ఉండనుంది. 3 జీబీ ర్యామ్ వేరియంట్‌కు ఈ ధర నిర్ణయించారు. ఈ ఫోన్ యూరోపియన్ మార్కెట్లలో సెప్టెంబరులో EUR 159 ప్రారంభ ధరతో (సుమారు రూ. 14,200) లాంచ్ అయింది. నవంబర్‌లో నోకియా బ్రాండ్ లైసెన్స్‌దారు అయిన హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా 2.4 ఫోన్‌ను 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.10,399కు భారత్‌లో తీసుకొచ్చింది.
Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి
Nokia 3.4 Specifications (నోకియా 3.4 ఫీచర్లు)
- నోకియా 3.4 డ్యూయల్ సిమ్ (నానో) ఆండ్రాయిడ్ 10 ఓపరేటింగ్ సిస్టమ్
- 6.39 అంగుళాల HD + (720x1,560 పిక్సల్స్) 19.5: 9 డిస్‌ప్లే
- ఇందులో 3జీ, 4జీ ర్యామ్.. 32జీబీ, 64జీబీ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్
- 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ సెన్సార్ ఉన్నాయి
- ఫ్రంట్ కెమెమరా 8 మెకా పిక్సెల్
- బ్యాటరీ 4000MAH, 10వాట్ చార్జింగ్ సపోర్ట్ చేయడం దీని ప్రత్యేకత
- 4G LTE, Wi-Fi సపోర్ట్ చేస్తుంది.
- అయితే ఈ మొబైల్ USB Type-C portతో రూపొందించారు.
Also Read : Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe